Title (Indic)ఇతవరులమయ్యే నిన్నింతకుఁ దెచ్చితిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతవరులమయ్యే నిన్నింతకుఁ దెచ్చితిమి కతలకెల్ల నిక్కిన కడు దొడ్డవాఁడవు (॥ఇత॥) చేరి నిన్నుఁ గూడేమంటా చెమట లంటింతుము మేరతో కొప్పువిరులు మీఁద రాలును యీరీతి మాతోడి పొందు ఇంతకుఁ దెచ్చెను నిన్ను పోరచి నందరిచేత పూజగొనేవాఁడవు (॥ఇత॥) మోవి తేనెలిచ్చేమంటా ముంచి యెంగిలి సేతుము భావించి పెనఁగఁబోతే పాదాలు సోఁకు వావులు మాతోడను వాఁటాలు సేసెను నిన్ను దేవరవై ఇందరిలో తేజమైన వాఁడవు (॥ఇత॥) రతుల మెప్పించేమంటా రసము లుబ్బింతుము చతురత మాటలెల్లా సాదింపు లౌను ఇతవై శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి సతులు పెక్కులు గల సవరనివాఁ డవు English(||pallavi||) idavarulamayye ninniṁtagum̐ dĕchchidimi kadalagĕlla nikkina kaḍu dŏḍḍavām̐ḍavu (||ida||) seri ninnum̐ gūḍemaṁṭā sĕmaḍa laṁṭiṁtumu merado kŏppuvirulu mīm̐da rālunu yīrīdi mādoḍi pŏṁdu iṁtagum̐ dĕchchĕnu ninnu porasi naṁdariseda pūjagŏnevām̐ḍavu (||ida||) movi tenĕlichchemaṁṭā muṁchi yĕṁgili sedumu bhāviṁchi pĕnam̐gam̐bode pādālu som̐ku vāvulu mādoḍanu vām̐ṭālu sesĕnu ninnu devaravai iṁdarilo tejamaina vām̐ḍavu (||ida||) radula mĕppiṁchemaṁṭā rasamu lubbiṁtumu sadurada māḍalĕllā sādiṁpu launu idavai śhrī veṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi sadulu pĕkkulu gala savaranivām̐ ḍavu