Title (Indic)ఇతవరిఁ గనక నీ కెరుఁగించితి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతవరిఁ గనక నీ కెరుఁగించితి కతలేర్పడకుండితే కాంతలు నవ్వేరు (॥॥) చెలితో నేకతమాడి చెప్పుతానుండె నీతి కలవెల్లా నీసుద్దులే కాఁబోలును అలివేణితో నీవు ఆడుకొని రావయ్య తెలుపుకొనకుండితే తెరవలు నవ్వేరు (॥॥) సుదతికి నిన్ను వేలఁ జూపుతానుండె నీతి అదన నీప్రసంగమే అది గాఁబోలు పదిలాన నీనేరాలు పాపుకొని రావయ్య ముదులకించ కుండితే ముదితలు నవ్వేరు (॥॥) నడుమ శ్రీ వేంకటేశ నవ్వుతానుండు నీసతి కడుఁగడు నిన్నుఁ జూచేకాఁబోలును అడరి నన్నేలితివి అమాఁటడిగి రావయ్య తడవ కూరకుండితే తరుణులు నవ్వేరు English(||pallavi||) idavarim̐ ganaga nī kĕrum̐giṁchidi kadalerbaḍaguṁḍide kāṁtalu navveru (||||) sĕlido negadamāḍi sĕppudānuṁḍĕ nīdi kalavĕllā nīsuddule kām̐bolunu aliveṇido nīvu āḍugŏni rāvayya tĕlubugŏnaguṁḍide tĕravalu navveru (||||) sudadigi ninnu velam̐ jūbudānuṁḍĕ nīdi adana nīprasaṁgame adi gām̐bolu padilāna nīnerālu pābugŏni rāvayya mudulagiṁcha kuṁḍide mudidalu navveru (||||) naḍuma śhrī veṁkaḍeśha navvudānuṁḍu nīsadi kaḍum̐gaḍu ninnum̐ jūsegām̐bolunu aḍari nannelidivi amām̐ṭaḍigi rāvayya taḍava kūraguṁḍide taruṇulu navveru