Title (Indic)ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు పతులకు సతులకు భావజుఁడే సాక్షి (॥ఇత॥) తలఁపు గలిగితేను దవ్వు లేమి నేరు వేమి అలరి సమ్మతించితె నడ్డాఁక లేమి కొలఁది మీరినప్పుడు కొంచ మేమి దొడ్డ యేమి నెల విచ్చి యేకతానఁ జేసినది చేఁత (॥ఇత॥) యిచ్చకమె కలిగితే యెక్కు వేమి తక్కు వేమి హెచ్చినమోహములకు నెగ్గు సిగ్గేది పచ్చి యైనపనులకు పాడి యాల పంతమేల చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట (॥ఇత॥) అన్నిటా నొక్కటియైతే నైన దేమి కాని దేమి యెన్నికల కెక్కితేను యీడు జోడేది వున్నతి శ్రీవెంకటేశుఁ డొనగూడె నేర్పు లివి కన్నెలుఁ దాఁ గూడిన గతులే సంగతులు English(||pallavi||) idarule mĕrum̐gudu remani sĕppam̐ga vachchu padulagu sadulagu bhāvajum̐ḍe sākṣhi (||ida||) talam̐pu galigidenu davvu lemi neru vemi alari sammadiṁchidĕ naḍḍām̐ka lemi kŏlam̐di mīrinappuḍu kŏṁcha memi dŏḍḍa yemi nĕla vichchi yegadānam̐ jesinadi sem̐ta (||ida||) yichchagamĕ kaligide yĕkku vemi takku vemi hĕchchinamohamulagu nĕggu siggedi pachchi yainabanulagu pāḍi yāla paṁtamela sĕchchĕram̐ damagum̐ dāmu sĕppinadi māḍa (||ida||) anniḍā nŏkkaḍiyaide naina demi kāni demi yĕnnigala kĕkkidenu yīḍu joḍedi vunnadi śhrīvĕṁkaḍeśhum̐ ḍŏnagūḍĕ nerbu livi kannĕlum̐ dām̐ gūḍina gadule saṁgadulu