Title (Indic)ఇతరుల నడుగము యితఁడే మా దాత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతరుల నడుగము యితఁడే మా దాత యితని యీవి వొరు లియ్యఁగఁ గలరా (॥ఇత॥) దేవ దేవుఁ డాదిమపురుషుఁడు హరి శ్రీవత్సాంకుఁడు చిన్మయుఁడు యీవల నావల యిలువేలుపతఁడు భావజగురుఁడు మా పాలిటివాఁడు (॥ఇత॥) జగదేకగురుఁడు శాశ్వతుఁ డచ్యుతుఁ- డగజకు వరదుఁడు అనంతుఁడు తగి మము నేలిన దైవము యేలిక నిగమమూర్తి మా నిజబంధువుఁడు (॥ఇత॥) కలిదోషహరుఁడు కైవల్యవిభుఁడు అలరిన శ్రీవేంకటాధిపుఁడు చలిమి బలిమి మా జననియు జనకుఁడు అలమి యితఁడు మాయంతర్యామి English(||pallavi||) idarula naḍugamu yidam̐ḍe mā dāda yidani yīvi vŏru liyyam̐gam̐ galarā (||ida||) deva devum̐ ḍādimaburuṣhum̐ḍu hari śhrīvatsāṁkum̐ḍu sinmayum̐ḍu yīvala nāvala yiluvelubadam̐ḍu bhāvajagurum̐ḍu mā pāliḍivām̐ḍu (||ida||) jagadegagurum̐ḍu śhāśhvadum̐ ḍachyudum̐- ḍagajagu varadum̐ḍu anaṁtum̐ḍu tagi mamu nelina daivamu yeliga nigamamūrdi mā nijabaṁdhuvum̐ḍu (||ida||) kalidoṣhaharum̐ḍu kaivalyavibhum̐ḍu alarina śhrīveṁkaḍādhibum̐ḍu salimi balimi mā jananiyu janagum̐ḍu alami yidam̐ḍu māyaṁtaryāmi