Title (Indic)ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు మతి వారూఁ దమవంటి మనుజులే కాక (॥ఇత॥) చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు ధారుణిలో నరులకు దైవమే కాక సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు బోరునఁ జేసిన పాపపుణ్యాలే కాక (॥ఇత॥) తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు గుడికొన్న తనలోని గుణాలే కాక కడుఁగీర్తి నపకీర్తి గట్టెడివారెవ్వరు నడచేటి తనవర్తనములే కాక (॥ఇత॥) ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక English(||pallavi||) idarula dūranela yĕvvarū nemi seduru madi vārūm̐ damavaṁṭi manujule kāga (||ida||) seri meluseyam̐ gīḍuseya nĕvvaru gardalu dhāruṇilo narulagu daivame kāga sārĕm̐ danavĕṁṭavĕṁṭam̐ janudĕṁchevārĕvvaru borunam̐ jesina pābabuṇyāle kāga (||ida||) tŏḍam̐gi pŏgaḍiṁchānu dūṣhiṁchā mukhyulĕvvaru guḍigŏnna tanaloni guṇāle kāga kaḍum̐gīrdi nabagīrdi gaṭṭĕḍivārĕvvaru naḍaseḍi tanavardanamule kāga (||ida||) ghanabaṁdhamokṣhālagum̐ gāraṇa mim̐ka nĕvvaru nanisina jñānājñānamule kāga tanagu śhrīveṁkaḍeśhum̐ dalabiṁchevā rĕvvaru kŏnamŏda lĕṟim̐gina gurum̐ḍe kāga