Title (Indic)ఇతరములన్నియు నడుమంత్రములే యెంచి చూచినను యింతాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతరములన్నియు నడుమంత్రములే యెంచి చూచినను యింతాను హితవగు బందుగుఁ డీశ్వరుఁడొకఁడే యితని మరవకుమీ జీవాత్మా (॥ఇతర॥) భవకూపంబుల బడలెడినాఁడు పాయనిబంధువుఁడితఁడొకఁడే దివిస్వర్గంబునఁ దేలెడినాఁడు తిరుగఁబాయకెపు డితఁడొకఁడే నవనరకంబుల నలఁగెడినాఁడు నటనలఁ బాయఁ డితఁడొకఁడే యివలనవలహృదయేశుఁడు విష్ణుఁడుయీతనిమరవకుమీ జీవాత్మా (॥ఇతర॥) పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయనిబందుగుఁ డితఁడొకఁడే విశదపు దుఃఖపువేళలనైనా విడువనిబంధువుఁ డితఁడొకఁడే శిశువైనప్పుడు వృద్దైనప్పుడు చిత్తపుబందుగుఁ డితఁడొకఁడే దశావతారపు విష్ణుఁడొకఁడే యితఁడని తలఁచుమీ జీవాత్మా (॥ఇతర॥) భావజకేలినిఁ జొక్కినప్పుడును ప్రాణబంధువుఁ డితఁడొకఁడే యీవల నావల నిహపరములలో నిన్నిటిబంధువుఁ డితఁడొకఁడే దైవము దానని శరణనియెడు నను దగ్గరికాచెను యితఁడొకఁడే శ్రీవేంకటగిరి నాయకుఁ డితఁడే చేరి భజించుము జీవాత్మా English(||pallavi||) idaramulanniyu naḍumaṁtramule yĕṁchi sūsinanu yiṁtānu hidavagu baṁdugum̐ ḍīśhvarum̐ḍŏgam̐ḍe yidani maravagumī jīvātmā (||idara||) bhavagūbaṁbula baḍalĕḍinām̐ḍu pāyanibaṁdhuvum̐ḍidam̐ḍŏgam̐ḍe divisvargaṁbunam̐ delĕḍinām̐ḍu tirugam̐bāyagĕbu ḍidam̐ḍŏgam̐ḍe navanaragaṁbula nalam̐gĕḍinām̐ḍu naḍanalam̐ bāyam̐ ḍidam̐ḍŏgam̐ḍe yivalanavalahṛdayeśhum̐ḍu viṣhṇum̐ḍuyīdanimaravagumī jīvātmā (||idara||) paśhumṛgādula vŏḍalĕttinappuḍu pāyanibaṁdugum̐ ḍidam̐ḍŏgam̐ḍe viśhadabu duḥkhabuveḽalanainā viḍuvanibaṁdhuvum̐ ḍidam̐ḍŏgam̐ḍe śhiśhuvainappuḍu vṛddainappuḍu sittabubaṁdugum̐ ḍidam̐ḍŏgam̐ḍe daśhāvadārabu viṣhṇum̐ḍŏgam̐ḍe yidam̐ḍani talam̐sumī jīvātmā (||idara||) bhāvajagelinim̐ jŏkkinappuḍunu prāṇabaṁdhuvum̐ ḍidam̐ḍŏgam̐ḍe yīvala nāvala nihabaramulalo ninniḍibaṁdhuvum̐ ḍidam̐ḍŏgam̐ḍe daivamu dānani śharaṇaniyĕḍu nanu daggarigāsĕnu yidam̐ḍŏgam̐ḍe śhrīveṁkaḍagiri nāyagum̐ ḍidam̐ḍe seri bhajiṁchumu jīvātmā