Title (Indic)ఇతరము లేదిఁక నెంచి చూచితేఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతరము లేదిఁక నెంచి చూచితేఁ బ్రతివచ్చు నితఁడు ప్రత్యక్షమై (॥ఇత॥) సకలలోకములు చర్చించి వెదకిన వొకఁడేపో పురుషోత్తముఁడు ప్రకటము బహురూపములయి నాతఁడు అకుటిలమహిమల యనంతుఁడే (॥ఇత॥) పర్విన జీవుల భావించి చూచిన సర్వాంతరాత్ముఁడు సర్వేశుఁడే వుర్విని వెలుపలనుండిన యాతఁడు నిర్వహించె నీ నీరజాక్షుఁడే (॥ఇత॥) చన్నకాలమున మన్నకాలమున నున్నవాఁడు యీవు పేంద్రుఁడే కన్నులెదుట నిఁకఁ గల కాలంబును అన్నిటా శ్రీవేంకటాధీశుఁడే English(||pallavi||) idaramu ledim̐ka nĕṁchi sūsidem̐ bradivachchu nidam̐ḍu pratyakṣhamai (||ida||) sagalalogamulu sarsiṁchi vĕdagina vŏgam̐ḍebo puruṣhottamum̐ḍu pragaḍamu bahurūbamulayi nādam̐ḍu aguḍilamahimala yanaṁtum̐ḍe (||ida||) parvina jīvula bhāviṁchi sūsina sarvāṁtarātmum̐ḍu sarveśhum̐ḍe vurvini vĕlubalanuṁḍina yādam̐ḍu nirvahiṁchĕ nī nīrajākṣhum̐ḍe (||ida||) sannagālamuna mannagālamuna nunnavām̐ḍu yīvu peṁdrum̐ḍe kannulĕduḍa nim̐kam̐ gala kālaṁbunu anniḍā śhrīveṁkaḍādhīśhum̐ḍe