Title (Indic)ఇతరమెరఁగ గతి యిదియె శరణ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతరమెరఁగ గతి యిదియె శరణ్యము సతతపూర్ణునికి శరణ్యము (॥ఇతర॥) సర్వలోకముల సాక్షైకాచిన - సర్వేశ్వరునకు శరణ్యము వుర్వికి మింటికి నొక్కటఁ బెరిగిన - సార్వభౌమునకు శరణ్యము (॥ఇతర॥) శ్రీకాంత నురముచెంగట నిలిపిన - సాకారునకును శరణ్యము పైకొని వెలిఁగేటి పరంజోతియై - సౌకుమారునకు శరణ్యము (॥ఇతర॥) తగనిహపరములు దాసుల కొసఁగేటి జగదీశ్వరునకు శరణ్యము నగు శ్రీ వేంకటనాథుఁడ నీకును సగుణమూర్తి యిదె శరణ్యము English(||pallavi||) idaramĕram̐ga gadi yidiyĕ śharaṇyamu sadatabūrṇunigi śharaṇyamu (||idara||) sarvalogamula sākṣhaigāsina - sarveśhvarunagu śharaṇyamu vurvigi miṁṭigi nŏkkaḍam̐ bĕrigina - sārvabhaumunagu śharaṇyamu (||idara||) śhrīgāṁta nuramusĕṁgaḍa nilibina - sāgārunagunu śharaṇyamu paigŏni vĕlim̐geḍi paraṁjodiyai - saugumārunagu śharaṇyamu (||idara||) taganihabaramulu dāsula kŏsam̐geḍi jagadīśhvarunagu śharaṇyamu nagu śhrī veṁkaḍanāthum̐ḍa nīgunu saguṇamūrdi yidĕ śharaṇyamu