Title (Indic)ఇతనికంటే మరి దైవముఁ గానము యెక్కడ వెదకిన నితఁడే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతనికంటే మరి దైవముఁ గానము యెక్కడ వెదకిన నితఁడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటి కాధారము దానె (॥ఇత॥) మది జలధుల నొక దైవము వెదకిన మత్స్యావతారం బితఁడు అదివో పాతాళమందు వెదకితే నాదికూర్మ మీవిష్ణుఁడు పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి చెదఱక కొండల గుహల వెదకితే శ్రీనరసింహం బున్నాఁడు (॥ఇత॥) తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది బలువీరులలో వెదకి చూచితే పరశురాముఁ డొకఁడై నాఁడు తలఁపున శివుఁడునుఁ బార్వతి వెదకిన తారకబ్రహ్మము రాఘవుఁడు కెలఁకుల నావులమందల వెదకిన కృష్ణుఁడు రాముఁడునైనారు (॥ఇత॥) పొంచి యసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాఁడు మించిన కాలము కడపట వెదకిన మీఁదటి కల్క్యావతారము అంచెల జీవులలోపల వెదకిన నంతర్యామై మెరసెను యెంచుక ఇహమునఁ బరమున వెదకిన యీతఁడే శ్రీవేంకటవిభుఁడు English(||pallavi||) idanigaṁṭe mari daivamum̐ gānamu yĕkkaḍa vĕdagina nidam̐ḍe adiśhayamagu mahimalado vĕlasĕnu anniḍi kādhāramu dānĕ (||ida||) madi jaladhula nŏga daivamu vĕdagina matsyāvadāraṁ bidam̐ḍu adivo pādāḽamaṁdu vĕdagide nādigūrma mīviṣhṇum̐ḍu pŏdigŏni yaḍavula vĕdagi sūside bhūvarāhamani kaṁṭimi sĕdaṟaga kŏṁḍala guhala vĕdagide śhrīnarasiṁhaṁ bunnām̐ḍu (||ida||) tĕlisi bhūnabhoṁtaramuna vĕdagina trivikramākṛti nilisinadi baluvīrulalo vĕdagi sūside paraśhurāmum̐ ḍŏgam̐ḍai nām̐ḍu talam̐puna śhivum̐ḍunum̐ bārvadi vĕdagina tāragabrahmamu rāghavum̐ḍu kĕlam̐kula nāvulamaṁdala vĕdagina kṛṣhṇum̐ḍu rāmum̐ḍunaināru (||ida||) pŏṁchi yasuragāṁtalalo vĕdagina buddhāvadāraṁbainām̐ḍu miṁchina kālamu kaḍabaḍa vĕdagina mīm̐daḍi kalgyāvadāramu aṁchĕla jīvulalobala vĕdagina naṁtaryāmai mĕrasĕnu yĕṁchuga ihamunam̐ baramuna vĕdagina yīdam̐ḍe śhrīveṁkaḍavibhum̐ḍu