Title (Indic)ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక ప్రతిలేదితనికి జీవకోట్లకుఁ బ్రాణబంధుఁ డితఁడు (॥ఇత॥) ముందు నేను ఘనగర్భనరకమున మునిఁగియున్ననాఁడు బొందితోడనే సుఖదుఃఖంబులఁ బొరయు తోడునీడితఁడు అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడఁ దా వెనువెంటనే చందపు నాయాతుమలోఁ బాయని సర్వాత్మకుఁ డితడే (॥ఇత॥) ఆని పట్టి నేఁ బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు మానుపనొల్లఁడు తాఁ బెరరేఁచును మతి కనుకూలం బితఁడు నానావిధులనుఁ బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు తానును ఆపరిణామంబులకు తగులైవుండును యీతఁడు (॥ఇత॥) తలఁచిన దగ్గరుఁ దడవక యుండిన దవ్వయివుండు నితఁడు కలసి మెలసి ఇహపరము లొసంగఁగఁ గాచుకవుండును యీతఁడు మెలఁగుచు సాకారముతో నున్నాఁడు మేటిశ్రీవేంకటపతి యీతఁడు వలసిన వావులరూపులు దాల్చినవాఁ డొకఁడేపో యీతఁడు English(||pallavi||) idani maṟasidimi yĕduḍane yuṁḍam̐ga yinnāḽlunu ne mĕram̐gaga pradiledidanigi jīvagoṭlagum̐ brāṇabaṁdhum̐ ḍidam̐ḍu (||ida||) muṁdu nenu ghanagarbhanaragamuna munim̐giyunnanām̐ḍu bŏṁdidoḍane sukhaduḥkhaṁbulam̐ bŏrayu toḍunīḍidam̐ḍu aṁdi svarganaragādulu sŏchchina akkaḍam̐ dā vĕnuvĕṁṭane saṁdabu nāyādumalom̐ bāyani sarvātmagum̐ ḍidaḍe (||ida||) āni paṭṭi nem̐ bābabuṇyamulu anubhaviṁchavalĕnannappuḍu mānubanŏllam̐ḍu tām̐ bĕrarem̐sunu madi kanugūlaṁ bidam̐ḍu nānāvidhulanum̐ bŏrali yalabudo nali ne nidriṁcheḍappuḍu tānunu ābariṇāmaṁbulagu tagulaivuṁḍunu yīdam̐ḍu (||ida||) talam̐sina daggarum̐ daḍavaga yuṁḍina davvayivuṁḍu nidam̐ḍu kalasi mĕlasi ihabaramu lŏsaṁgam̐gam̐ gāsugavuṁḍunu yīdam̐ḍu mĕlam̐gusu sāgāramudo nunnām̐ḍu meḍiśhrīveṁkaḍabadi yīdam̐ḍu valasina vāvularūbulu dālsinavām̐ ḍŏgam̐ḍebo yīdam̐ḍu