Title (Indic)ఇతని కితఁడేకాక యితరులు సరియా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతని కితఁడేకాక యితరులు సరియా మితి లోకా లితని మేనిలోనే కావా (॥ఇత॥) కమలనాభుని భయంకరకోపముతోడ రమణ వేరొకరివరంబులు సరియా తమితోడఁ దల దుంచి తగినవరము లిచ్చె అమరఁగ నరకాసురాదులకు నితఁడు (॥ఇత॥) కరివరదుని పేరుగలసిన తిట్లతో పరదేవతల మంత్రపఠనలు సరియా నిరతి శిశుపాలుని నిందకు శిక్షించి పరలోక మిచ్చినట్టి భావము వినరా (॥ఇత॥) చలిమి శ్రీవేంకటేశు శరణాగతితోడ బలిమి మించిన బ్రహ్మపట్టము సరియా వొలిసిన ధ్రువునకు వున్నతలోక మిచ్చె అల బ్రహ్మలోకమున కదె మీఁ దెఱఁగరా English(||pallavi||) idani kidam̐ḍegāga yidarulu sariyā midi logā lidani menilone kāvā (||ida||) kamalanābhuni bhayaṁkaragobamudoḍa ramaṇa verŏgarivaraṁbulu sariyā tamidoḍam̐ dala duṁchi taginavaramu lichchĕ amaram̐ga naragāsurādulagu nidam̐ḍu (||ida||) karivaraduni perugalasina tiṭlado paradevadala maṁtrabaṭhanalu sariyā niradi śhiśhubāluni niṁdagu śhikṣhiṁchi paraloga michchinaṭṭi bhāvamu vinarā (||ida||) salimi śhrīveṁkaḍeśhu śharaṇāgadidoḍa balimi miṁchina brahmabaṭṭamu sariyā vŏlisina dhruvunagu vunnadaloga michchĕ ala brahmalogamuna kadĕ mīm̐ dĕṟam̐garā