Title (Indic)ఇటమీఁద నీవు మరి యేమిసేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటమీఁద నీవు మరి యేమిసేసేవు చిటుకన నేమే అక్కచెల్లెండ్ల మైతిమి (॥ఇట॥) తతిగొని చెప్పేవు తగవులు నీకు నీవే యితవరివలెనే యీకెకు నాకు మతకారివాఁడవు నీ మర్మము నేనెఱుఁగుదు సతుల మిద్దరమును సంతమైతి మిపుడు (॥ఇట॥) నెట్టుకొని సాకిరై నిలిచేవు నీవే వచ్చి చుట్టము వలెనే వుండి సారిది మాకు గుట్టువాయవాఁడవు నీ కతలు నే నెఱుఁగుదు గుట్టున బాసలు సేనుకొంటిమి నే నిపుడు (॥ఇట॥) యీవేళ పొందులు విడే లిచ్చేవు చేత నీవే భావ మరఁటివలెనే పైపై నీవు శ్రీవేంకటేశ్వరుని చత్తము నేనెఱుఁగుదును యీవర సవతులమై యీడేరితిమిపుడు English(||pallavi||) iḍamīm̐da nīvu mari yemisesevu siḍugana neme akkasĕllĕṁḍla maidimi (||iḍa||) tadigŏni sĕppevu tagavulu nīgu nīve yidavarivalĕne yīgĕgu nāgu madagārivām̐ḍavu nī marmamu nenĕṟum̐gudu sadula middaramunu saṁtamaidi mibuḍu (||iḍa||) nĕṭṭugŏni sāgirai nilisevu nīve vachchi suṭṭamu valĕne vuṁḍi sāridi māgu guṭṭuvāyavām̐ḍavu nī kadalu ne nĕṟum̐gudu guṭṭuna bāsalu senugŏṁṭimi ne nibuḍu (||iḍa||) yīveḽa pŏṁdulu viḍe lichchevu seda nīve bhāva maram̐ṭivalĕne paibai nīvu śhrīveṁkaḍeśhvaruni sattamu nenĕṟum̐gudunu yīvara savadulamai yīḍeridimibuḍu