Title (Indic)ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుఁడు రతికెక్కఁ గొలిచిన రక్షించు నితఁడు (॥ఇతఁ॥) తరణివంశజుడై తాటకను హరియించి అరుదుగ విశ్వామిత్రుయాగము గాచి హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లియాడి పరశురాముని నిజబలిమి చేకొనెను (॥ఇతఁ॥) మునులకభయమిచ్చి మొగి నసురలఁ ద్రుంచి ఘనమైన మాయామృగముఁ జంపి కినిసి వాలిఁ గొట్టి సుగ్రీవునిఁ బట్టముగట్టి వనధి బంధించి లంక వడిఁ జుట్టుముట్టెను (॥ఇతఁ॥) బలురావణునిఁ జంపి పుష్పకముపైఁ దాఁ జేకొని లలి విభీషణునకు లంక ఇచ్చి చెలఁగి యయోధ్య యేలి శ్రీవేంకటాద్రిమీఁద వెలయ రాముఁడు దానై విశ్వమెల్లా నేలెను English(||pallavi||) idam̐ḍu tāragabrahma mīdam̐ḍu sarveśhvarum̐ḍu radigĕkkam̐ gŏlisina rakṣhiṁchu nidam̐ḍu (||idam̐||) taraṇivaṁśhajuḍai tāḍaganu hariyiṁchi aruduga viśhvāmitruyāgamu gāsi harunivillu virisi yaṭṭĕ sīdam̐ bĕṁḍliyāḍi paraśhurāmuni nijabalimi segŏnĕnu (||idam̐||) munulagabhayamichchi mŏgi nasuralam̐ druṁchi ghanamaina māyāmṛgamum̐ jaṁpi kinisi vālim̐ gŏṭṭi sugrīvunim̐ baṭṭamugaṭṭi vanadhi baṁdhiṁchi laṁka vaḍim̐ juṭṭumuṭṭĕnu (||idam̐||) balurāvaṇunim̐ jaṁpi puṣhpagamubaim̐ dām̐ jegŏni lali vibhīṣhaṇunagu laṁka ichchi sĕlam̐gi yayodhya yeli śhrīveṁkaḍādrimīm̐da vĕlaya rāmum̐ḍu dānai viśhvamĕllā nelĕnu