Title (Indic)ఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురు చతురత మెరసె నిచ్చట హనుమంతుఁడు (॥ఇతఁ॥) అకాస (శ?) మంతయు నిండి యవ్వలికిఁ దోఁక చాఁచి పైకొని పాతాళానఁ బాదాలు మోపి కైకొని దశదిక్కులు కరములఁ గబళించి సాకారము చూపినాఁ డిచ్చట హనుమంతుఁడు (॥ఇతఁ॥) కొంచక సురలు రోమకూపముల విహరించ ముంచి ధ్రువమండలము మొగమై యుండ యెంచఁగ లోకములెల్లా యెడనెడ సందులుగా చంచుల మెరసినాఁ డిచ్చట హనుమంతుఁడు (॥ఇతఁ॥) గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటితటము గాఁగా ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుఁడు English(||pallavi||) idam̐ḍu rāmunibaṁṭu yidani kĕvva rĕduru sadurada mĕrasĕ nichchaḍa hanumaṁtum̐ḍu (||idam̐||) agāsa (śha?) maṁtayu niṁḍi yavvaligim̐ dom̐ka sām̐si paigŏni pādāḽānam̐ bādālu mobi kaigŏni daśhadikkulu karamulam̐ gabaḽiṁchi sāgāramu sūbinām̐ ḍichchaḍa hanumaṁtum̐ḍu (||idam̐||) kŏṁchaga suralu romagūbamula vihariṁcha muṁchi dhruvamaṁḍalamu mŏgamai yuṁḍa yĕṁcham̐ga logamulĕllā yĕḍanĕḍa saṁdulugā saṁchula mĕrasinām̐ ḍichchaḍa hanumaṁtum̐ḍu (||idam̐||) garima ravisaṁdrulu karṇaguṁḍalamulugā dharaṇi meruvu kaḍidaḍamu gām̐gā iravugā śhrīveṁkaḍeśhuni sevagum̐ḍai bĕrasĕ nichchaḍa nidĕ pĕdda hanumaṁtum̐ḍu