Title (Indic)ఇట తఱవాతిపను లిఁక నీకే తెలుసును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇట తఱవాతిపను లిఁక నీకే తెలుసును యెటువలెనైనాఁ జేయు మెదురాడ నీకును (॥ఇట॥) చేసిననావిన్నపముల చిత్తానఁ బట్టెనో లేదో ఆసల నెక్కడ పరాకైవుంటివో వేసరక నాతో పొందు వేడుకాయనో లేదో యేసుద్ది నెఱఁగ నీయిచ్చలోనిదానను (॥ఇట॥) యిట్టె నాతో కాఁపురము ఇతవాయనో కాదో నెట్టన నెటువంటివి నీకుఁ బ్రియమో జట్టిగొన్ననా సేవలు సమ్మతాయనో కాదో యెట్టౌతా నెఱఁగ నీయిచ్చలోనిదానను (॥ఇట॥) నెమ్మి నాచక్కఁదనము నీయీడువచ్చునో రాదో కమ్మర నాకు నీదయ గులుగుటెట్టో పమ్మి యలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడ యెమ్మె లెఱఁగనియాల నీయిచ్చలోదానను English(||pallavi||) iḍa taṟavādibanu lim̐ka nīge tĕlusunu yĕḍuvalĕnainām̐ jeyu mĕdurāḍa nīgunu (||iḍa||) sesinanāvinnabamula sittānam̐ baṭṭĕno ledo āsala nĕkkaḍa parāgaivuṁṭivo vesaraga nādo pŏṁdu veḍugāyano ledo yesuddi nĕṟam̐ga nīyichchalonidānanu (||iḍa||) yiṭṭĕ nādo kām̐puramu idavāyano kādo nĕṭṭana nĕḍuvaṁṭivi nīgum̐ briyamo jaṭṭigŏnnanā sevalu sammadāyano kādo yĕṭṭaudā nĕṟam̐ga nīyichchalonidānanu (||iḍa||) nĕmmi nāsakkam̐danamu nīyīḍuvachchuno rādo kammara nāgu nīdaya guluguḍĕṭṭo pammi yalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa yĕmmĕ lĕṟam̐ganiyāla nīyichchalodānanu