Title (Indic)ఇట మీఁదఁ జవిగాదు యేమన్నాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇట మీఁదఁ జవిగాదు యేమన్నాను చిటుక వేసినంతలో చెప్పినట్టు సేయనా (॥ఇట॥) కోపగించుకొని నిన్ను గొణఁగినదానఁ గాన పైపై సిగ్గుపడి యేమీఁ బలుకఁగాక యేపునఁదొల్లిటివలె నిట్టె నాయంత వుంటేను మాపుదాఁకా నీతోను మాటలే యాడనా (॥ఇట॥) చలము నీతో నేను సాదించినదానఁ గాన చెలఁగి నీకుఁ బ్రియాలు చెప్పఁగాక పొలసి నీపాలికి నేఁ బొరుగుదాననై వుంటే చెలిమి నెరపి నీకు సేవలెల్లాఁ జేయనా (॥ఇట॥) నంటు సేసి యేడనైనా నవ్వినట్టిదానఁ గాన గొంటుఁజందమున నిన్నుఁగూడితిఁ గాక అంటి ముట్టి శ్రీ వేంకటాధిప నన్నే లితివి యింటికాడ నీకు నేను యిచ్చకమే యాడనా English(||pallavi||) iḍa mīm̐dam̐ javigādu yemannānu siḍuga vesinaṁtalo sĕppinaṭṭu seyanā (||iḍa||) kobagiṁchugŏni ninnu gŏṇam̐ginadānam̐ gāna paibai siggubaḍi yemīm̐ balugam̐gāga yebunam̐dŏlliḍivalĕ niṭṭĕ nāyaṁta vuṁṭenu mābudām̐kā nīdonu māḍale yāḍanā (||iḍa||) salamu nīdo nenu sādiṁchinadānam̐ gāna sĕlam̐gi nīgum̐ briyālu sĕppam̐gāga pŏlasi nībāligi nem̐ bŏrugudānanai vuṁṭe sĕlimi nĕrabi nīgu sevalĕllām̐ jeyanā (||iḍa||) naṁṭu sesi yeḍanainā navvinaṭṭidānam̐ gāna gŏṁṭum̐jaṁdamuna ninnum̐gūḍidim̐ gāga aṁṭi muṭṭi śhrī veṁkaḍādhiba nanne lidivi yiṁṭigāḍa nīgu nenu yichchagame yāḍanā