Title (Indic)ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను చెచ్చెరఁ దగవు లింకఁ జెప్పఁ గదరో (॥ఇచ్చి॥) నిలిచినది జగము నిండినది భోగము కలిగె జీవుల కొక్కకాణాచి వలయశాసనాలు వడి నాల్గు వేదములు చలపట్టి జాణలు చదువుకోరో (॥ఇచ్చి॥) పారినవి మనసులు పట్టినది జననము పోరు దీరెఁ గర్మముల పొలమేర కోరికలె సాక్షులు గుట్టలు త్రిగుణములు వూరుఁ బేరుఁ దెలుసుక వొడఁబడరో (॥ఇచ్చి॥) దక్కినది ధర్మము తప్పనిది భాగ్యము లెక్కించ నుదుటివ్రాలె లిఖితములు యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటికి మూలము చిక్కులు వాపె నితని సేవించరో English(||pallavi||) ichchinavām̐ḍu hari puchchugŏnnavām̐ḍa nenu sĕchchĕram̐ dagavu liṁkam̐ jĕppam̐ gadaro (||ichchi||) nilisinadi jagamu niṁḍinadi bhogamu kaligĕ jīvula kŏkkagāṇāsi valayaśhāsanālu vaḍi nālgu vedamulu salabaṭṭi jāṇalu saduvugoro (||ichchi||) pārinavi manasulu paṭṭinadi jananamu poru dīrĕm̐ garmamula pŏlamera korigalĕ sākṣhulu guṭṭalu triguṇamulu vūrum̐ berum̐ dĕlusuga vŏḍam̐baḍaro (||ichchi||) dakkinadi dharmamu tappanidi bhāgyamu lĕkkiṁcha nuduḍivrālĕ likhidamulu yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍinniḍigi mūlamu sikkulu vābĕ nidani seviṁcharo