Title (Indic)ఇచ్చితివా కానికె తా నేమనీనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చితివా కానికె తా నేమనీనే తచ్చి తచ్చి తనమాఁట దలఁచుకొమ్మనవే (॥ఇచ్చి॥) చిగిరించెఁ జిత్తము చెమరించె నామేను యెగెసక్కెపు విభుఁడు యేమనీనే నగవులాయ వలపు నావంటివారిలోనెల్లా తగవైన తనబాస తలఁచుకొమ్మనవే (॥ఇచ్చి॥) చిమ్మిరేఁగే వయసుచే చేవదేరీ నాయాసలు యెమ్మెలరమణుఁడు తానేమనీనే వుమ్మడి నున్నది గుట్టు వూరెల్లాఁబెనురట్టు తమ్మిరేకు తనవాఁ(వ్రా?) త తలఁచుకొమ్మనవే (॥ఇచ్చి॥) వెలిఁబడె సిగ్గులు వెరగాయరతులు యెలమి శ్రీ వేంకటేశుఁ డేమనీనే కలసెఁ దనకు నాకు కాఁగిటనే వావులు తలపోసి యీ చేఁతలు తలఁచుకొమ్మనవే English(||pallavi||) ichchidivā kānigĕ tā nemanīne tachchi tachchi tanamām̐ṭa dalam̐sugŏmmanave (||ichchi||) sigiriṁchĕm̐ jittamu sĕmariṁchĕ nāmenu yĕgĕsakkĕbu vibhum̐ḍu yemanīne nagavulāya valabu nāvaṁṭivārilonĕllā tagavaina tanabāsa talam̐sugŏmmanave (||ichchi||) simmirem̐ge vayasuse sevaderī nāyāsalu yĕmmĕlaramaṇum̐ḍu tānemanīne vummaḍi nunnadi guṭṭu vūrĕllām̐bĕnuraṭṭu tammiregu tanavām̐(vrā?) ta talam̐sugŏmmanave (||ichchi||) vĕlim̐baḍĕ siggulu vĕragāyaradulu yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍemanīne kalasĕm̐ danagu nāgu kām̐giḍane vāvulu talabosi yī sem̐talu talam̐sugŏmmanave