Title (Indic)ఇచ్చితిమి కానుక యింతక తొలుతే నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చితిమి కానుక యింతక తొలుతే నీకు తచ్చేము మా సిగ్గు దగ్గరి రావయ్యా (॥ఇచ్చి॥) పంతము లేమీనాడరు పడఁతులయినవారు చింతలనే వలపించి చిక్కింతురు అంత నేరుపరివైతే అందుకేమి దోసమా దొంతినున్నది మా గుట్టు దోసిలోగ్గవయ్యా (॥ఇచ్చి॥) యెగసక్కెము సేయరు ఇంతులైన యట్టివారు తగులాయములు చూపి దక్కఁగొందురు నగ నీవు దొరకొంటే నాకు నీకు దోసమా చిగిరించె మాకోరికె చేఇ చాఁచవయ్యా (॥ఇచ్చి॥) కక్కసించి పెనఁగరు కాంతలయినవారు గక్కనఁ గెమ్మోవి ఇచ్చి కాఁగిలింతురు యెక్కువ శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁ గలసితి పిక్కటిల్లె మా చన్నులు బిగిఇంచవయ్యా English(||pallavi||) ichchidimi kānuga yiṁtaga tŏlude nīgu tachchemu mā siggu daggari rāvayyā (||ichchi||) paṁtamu lemīnāḍaru paḍam̐tulayinavāru siṁtalane valabiṁchi sikkiṁturu aṁta nerubarivaide aṁdugemi dosamā dŏṁtinunnadi mā guṭṭu dosiloggavayyā (||ichchi||) yĕgasakkĕmu seyaru iṁtulaina yaṭṭivāru tagulāyamulu sūbi dakkam̐gŏṁduru naga nīvu dŏragŏṁṭe nāgu nīgu dosamā sigiriṁchĕ māgorigĕ sei sām̐savayyā (||ichchi||) kakkasiṁchi pĕnam̐garu kāṁtalayinavāru gakkanam̐ gĕmmovi ichchi kām̐giliṁturu yĕkkuva śhrī veṁkaḍeśha iḍu nannum̐ galasidi pikkaḍillĕ mā sannulu bigiiṁchavayyā