Title (Indic)ఇచ్చెరిఁగి సేవలు సేయించుకోవదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చెరిఁగి సేవలు సేయించుకోవదా మచ్చికతోడ నన్ను మన్నించేవాఁడవు (॥ఇచ్చె॥) నిద్దిరించేవేళ నన్ను నీవేల లేపితివి వొద్దఁ గాచుకున్నసతి యుండఁగాను అద్దుకొని నాపై బత్తి అంత నీకుఁ గలిగితే అద్దమరాతిరిదాఁకా నలయించవలెనా (॥ఇచ్చె॥) తొడ చరచి నన్నేల అడిగేవు విడెము అడపమువనిత నీ కందియ్యఁగా కడుఁదమకము నాపైఁ గలవాఁడవై తేను అడియాసలఁ బెట్టి నన్నలయించవలెనా (॥ఇచ్చె॥) బలిమిచేసి నన్నెంత పచ్చిచేసి కూడితివి అలమేల్మంగ నీవురమందు నుండఁగా యెలమి శ్రీవేంకటేశ యిద్దరము నితవైతే అలవోకగా నన్ను నలయించవలెనా English(||pallavi||) ichchĕrim̐gi sevalu seyiṁchugovadā machchigadoḍa nannu manniṁchevām̐ḍavu (||ichchĕ||) niddiriṁcheveḽa nannu nīvela lebidivi vŏddam̐ gāsugunnasadi yuṁḍam̐gānu addugŏni nābai batti aṁta nīgum̐ galigide addamarādiridām̐kā nalayiṁchavalĕnā (||ichchĕ||) tŏḍa sarasi nannela aḍigevu viḍĕmu aḍabamuvanida nī kaṁdiyyam̐gā kaḍum̐damagamu nābaim̐ galavām̐ḍavai tenu aḍiyāsalam̐ bĕṭṭi nannalayiṁchavalĕnā (||ichchĕ||) balimisesi nannĕṁta pachchisesi kūḍidivi alamelmaṁga nīvuramaṁdu nuṁḍam̐gā yĕlami śhrīveṁkaḍeśha yiddaramu nidavaide alavogagā nannu nalayiṁchavalĕnā