Title (Indic)ఇచ్చలోనిదాన నేను ఇన్నిటా నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చలోనిదాన నేను ఇన్నిటా నీకు గచ్చు లేమిటికిరా చేఁగలమఱ్ఱిచెన్నుఁడా (॥॥) ఆరితేరి కతలెల్లా నడుగుతా నన్ను నీవు చేరి యానవెట్టకురా చెప్పేఁగాని దూరుసేయ కిఁకనైనా దోసము లేదనరా సారెసారె నీకు మొక్కి జట్టిగొనే నేను (॥॥) వొగ్గి కొంగువట్టుకొని వొకటొకటే యడిగి సిగ్గులువడకురా చెప్పేఁగాని అగ్గలమై కిందుపడి ఆసుద్దులు మఱవరా అగ్గమై నీవూడిగాలే అన్నీఁ జేసే నేను (॥॥) యెన్నిఁగ శ్రీ వేంకటాద్రి నిరవై నన్నేలితివి చిన్ని గోరు దియ్యకురా చెప్పేఁగాని మన్నించితి వెప్పుడు నామచ్చిక దలఁచరా సన్నల నీరతులకే సమ్మతించే నేను English(||pallavi||) ichchalonidāna nenu inniḍā nīgu gachchu lemiḍigirā sem̐galamaṭrisĕnnum̐ḍā (||||) ārideri kadalĕllā naḍugudā nannu nīvu seri yānavĕṭṭagurā sĕppem̐gāni dūruseya kim̐kanainā dosamu ledanarā sārĕsārĕ nīgu mŏkki jaṭṭigŏne nenu (||||) vŏggi kŏṁguvaṭṭugŏni vŏgaḍŏgaḍe yaḍigi sigguluvaḍagurā sĕppem̐gāni aggalamai kiṁdubaḍi āsuddulu maṟavarā aggamai nīvūḍigāle annīm̐ jese nenu (||||) yĕnnim̐ga śhrī veṁkaḍādri niravai nannelidivi sinni goru diyyagurā sĕppem̐gāni manniṁchidi vĕppuḍu nāmachchiga dalam̐sarā sannala nīradulage sammadiṁche nenu