Title (Indic)ఇచ్చలోఁ గోరేవల్లా ఇచ్చే ధనము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చలోఁ గోరేవల్లా ఇచ్చే ధనము అచ్చుతనామమె పో అధికపు ధనము (॥ఇచ్చ॥) నారదాదులు వొగడే నాలుకపయి ధనము సారపు వేదములలో చాటే ధనము కూరిమి మునులు దాఁచుకొన్నట్టి ధనము నారాయణ నామమిదే నమ్మినట్టి ధనము (॥ఇచ్చ॥) పరమపదవికి సంబళ మైన ధనము యిరవై భక్తులకెల్లా నింటి ధనము పరగ నంతరంగాన పాఁతినట్టి ధనము హరినామ మిదియ పో అరచేతి ధనము (॥ఇచ్చ॥) పొంచి శివుఁడు కాశిలో బోధించే ధనము ముంచిన ఆచార్యుల మూలధనము పంచి శ్రీవేంకటపతి పాలించే ధనము నించి విష్ణునామ మదే నిత్యమైన ధనము English(||pallavi||) ichchalom̐ gorevallā ichche dhanamu achchudanāmamĕ po adhigabu dhanamu (||ichcha||) nāradādulu vŏgaḍe nālugabayi dhanamu sārabu vedamulalo sāḍe dhanamu kūrimi munulu dām̐sugŏnnaṭṭi dhanamu nārāyaṇa nāmamide namminaṭṭi dhanamu (||ichcha||) paramabadavigi saṁbaḽa maina dhanamu yiravai bhaktulagĕllā niṁṭi dhanamu paraga naṁtaraṁgāna pām̐tinaṭṭi dhanamu harināma midiya po arasedi dhanamu (||ichcha||) pŏṁchi śhivum̐ḍu kāśhilo bodhiṁche dhanamu muṁchina āsāryula mūladhanamu paṁchi śhrīveṁkaḍabadi pāliṁche dhanamu niṁchi viṣhṇunāma made nityamaina dhanamu