Title (Indic)ఇచ్చకురాలు గనక యేమీననదు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకురాలు గనక యేమీననదు గాక పచ్చి చేఁతల కెల్లాను పడతి వోపినదా (॥॥) కొమ్మ జెఇవట్టి తీసి కొసరేవు తొలుతనె రమ్మని పిలువఁగాను రాననెనా యెమ్మెల కిందరుఁ జూడ నింత సేసితివి గాక దిమ్మరి నీ గుంపెనకు తెరవ వోపినదా (॥॥) బలిమిఁ జేయి వట్టించి పైపై దమ్మ వుమిసేవు చెలి కప్పుడే చెప్పఁగా సేయదాయనా చలము లిందరిలోన సాదించితివి గాక వలవనిసటలకు వనిత వోపినదా (॥॥) యీడఁ జన్నుల విసికే వింతి పానుపు మీఁదట కూడినట్టెల్లా నియ్యకొనదాయనా వేడుక కిందరిలో శ్రీవేంకటేశ నవ్వేవు గా- కేడలేని బీరాలకు నీకాంత వోపనదా English(||pallavi||) ichchagurālu ganaga yemīnanadu gāga pachchi sem̐tala kĕllānu paḍadi vobinadā (||||) kŏmma jĕivaṭṭi tīsi kŏsarevu tŏludanĕ rammani piluvam̐gānu rānanĕnā yĕmmĕla kiṁdarum̐ jūḍa niṁta sesidivi gāga dimmari nī guṁpĕnagu tĕrava vobinadā (||||) balimim̐ jeyi vaṭṭiṁchi paibai damma vumisevu sĕli kappuḍe sĕppam̐gā seyadāyanā salamu liṁdarilona sādiṁchidivi gāga valavanisaḍalagu vanida vobinadā (||||) yīḍam̐ jannula visige viṁti pānubu mīm̐daḍa kūḍinaṭṭĕllā niyyagŏnadāyanā veḍuga kiṁdarilo śhrīveṁkaḍeśha navvevu gā- keḍaleni bīrālagu nīgāṁta vobanadā