Title (Indic)ఇచ్చకురాల నీకు నింత సేసేనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకురాల నీకు నింత సేసేనా అచ్చువలె నుండ నిన్ను నంత సేసేనా (॥ఇచ్చ॥) తగవులఁబెట్టె నాపె తమకించి తిట్టె నాపె యెగసక్కేన నేనైతే యింత సే సేనా నగుతానే వద్దనుండి నాయము దీర్చితిఁగాక అగపడ్డనిన్ను రట్టు అంత సే సేనా (॥ఇచ్చ॥) సన్నలు సేసె నాపె చలము సాదించె నాపె యెన్నికలుగా నిన్ను యింత సే సేనా పన్ని నే నడుమ నిన్నుఁ బట్టుక వుండితిఁగాక అన్నిటా నాపెకు లోనై అంత సే సేనా (॥ఇచ్చ॥) కఱకఱిఁ బెట్టె నాపె కాఁగిలించుకొనె నాపె యెఱవులు చూపి నిన్ను నంత సే సేనూ వెఱవు తోడుతను శ్రీ వేంకటేశ నేఁగూడితి అఱలేక చొక్కి నిన్ను నంత సే సేనా English(||pallavi||) ichchagurāla nīgu niṁta sesenā achchuvalĕ nuṁḍa ninnu naṁta sesenā (||ichcha||) tagavulam̐bĕṭṭĕ nābĕ tamagiṁchi tiṭṭĕ nābĕ yĕgasakkena nenaide yiṁta se senā nagudāne vaddanuṁḍi nāyamu dīrsidim̐gāga agabaḍḍaninnu raṭṭu aṁta se senā (||ichcha||) sannalu sesĕ nābĕ salamu sādiṁchĕ nābĕ yĕnnigalugā ninnu yiṁta se senā panni ne naḍuma ninnum̐ baṭṭuga vuṁḍidim̐gāga anniḍā nābĕgu lonai aṁta se senā (||ichcha||) kaṟagaṟim̐ bĕṭṭĕ nābĕ kām̐giliṁchugŏnĕ nābĕ yĕṟavulu sūbi ninnu naṁta se senū vĕṟavu toḍudanu śhrī veṁkaḍeśha nem̐gūḍidi aṟalega sŏkki ninnu naṁta se senā