Title (Indic)ఇచ్చకుఁడ విన్నిటాను యే మంటివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకుఁడ విన్నిటాను యే మంటివి యెచ్చరించే నింతె నిన్ను యే మంటివి (॥ఇచ్చ॥) కాంత నిన్నుఁ దెమ్మనఁగఁ గాచుకున్నదాన నేను యింత వొద్దాయ నింక నే మంటివి చింతతో నెదురు చూచి సేసవెట్టె నంటా నీకు యెంత లేదు నీకు బని యే మంటివి (॥ఇచ్చ॥) ఆకె నీకడ నున్న అంపఁగా వచ్చితి నేను యేకచిత్తమున నిట్టె యే మంటివి లేకలు నీకడ కంపె లేచి విచ్చేయఁగదవయ్య యేకతాన నప్పుడు నీ వే మంటివి (॥ఇచ్చ॥) కొమ్మ లోననుండి వచ్చి కొంగు వట్టి నిన్నుఁ దీసె యిమ్ముల నీ మొగమాట నే మంటివి సమ్మ తై శ్రీవెంకటేశ సరుగఁ గూడితి రిదె యిమ్మనీ విడెము నిన్ను నే మంటివి English(||pallavi||) ichchagum̐ḍa vinniḍānu ye maṁṭivi yĕchchariṁche niṁtĕ ninnu ye maṁṭivi (||ichcha||) kāṁta ninnum̐ dĕmmanam̐gam̐ gāsugunnadāna nenu yiṁta vŏddāya niṁka ne maṁṭivi siṁtado nĕduru sūsi sesavĕṭṭĕ naṁṭā nīgu yĕṁta ledu nīgu bani ye maṁṭivi (||ichcha||) āgĕ nīgaḍa nunna aṁpam̐gā vachchidi nenu yegasittamuna niṭṭĕ ye maṁṭivi legalu nīgaḍa kaṁpĕ lesi vichcheyam̐gadavayya yegadāna nappuḍu nī ve maṁṭivi (||ichcha||) kŏmma lonanuṁḍi vachchi kŏṁgu vaṭṭi ninnum̐ dīsĕ yimmula nī mŏgamāḍa ne maṁṭivi samma tai śhrīvĕṁkaḍeśha sarugam̐ gūḍidi ridĕ yimmanī viḍĕmu ninnu ne maṁṭivi