Title (Indic)ఇచ్చకములే సేసి యీడేరవలెఁగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకములే సేసి యీడేరవలెఁగాక పచ్చిగా బలిమిసేసి పదరఁగవచ్చునా (॥ఇచ్చ॥) వోసరించి వేడుకల కొడిగట్టినవారికి వేసరఁగవచ్చునా వేగినంతాను ఆసలనే తుదకెక్కి ఆఱడైనవారికి గోసనాసగాఁ బతిని గుంపించవచ్చునా (॥ఇచ్చ॥) చూపులకే లాచి లాచి చొక్కియుండేవారికి వోపననవచ్చునా వూరకైనాను యేపున మోవితేనెకు నేఁకరేటివారికి మాపుదాఁకా జోలిసేసి మఱవఁగ వచ్చునా (॥ఇచ్చ॥) తనివోని కాఁగిట దగులైనవారికి చెనక కుండవచ్చునా చేతులారాను యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేఁడు పెనఁగులాటకాక పిరితియ్యవచ్చునా English(||pallavi||) ichchagamule sesi yīḍeravalĕm̐gāga pachchigā balimisesi padaram̐gavachchunā (||ichcha||) vosariṁchi veḍugala kŏḍigaṭṭinavārigi vesaram̐gavachchunā veginaṁtānu āsalane tudagĕkki āṟaḍainavārigi gosanāsagām̐ badini guṁpiṁchavachchunā (||ichcha||) sūbulage lāsi lāsi sŏkkiyuṁḍevārigi vobananavachchunā vūragainānu yebuna movidenĕgu nem̐kareḍivārigi mābudām̐kā jolisesi maṟavam̐ga vachchunā (||ichcha||) tanivoni kām̐giḍa dagulainavārigi sĕnaga kuṁḍavachchunā sedulārānu yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nem̐ḍu pĕnam̐gulāḍagāga piridiyyavachchunā