Title (Indic)ఇచ్చకము సేసుకొని ఇయ్యకొనుటగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకము సేసుకొని ఇయ్యకొనుటగాక రచ్చలోన సారె సారె రవ్వసేయనేల (॥ఇచ్చ॥) దొరయైనసతి సవతుల నెందరిఁ దెచ్చినా యెరపులేని ఇల్లాలి కేల కోపము సిరుల కొనగోరిలచ్చెన లెన్ని నించుకొన్నా విరసము చేసుకొని వెంగెమాడనేల (॥ఇచ్చ॥) చలపాదిమగఁడు విచ్చనవిడిఁ దిరిగితే వలచినదేవులకు వాదించనేల వొలసి యెందరిచే సేవలు సేయించుకొన్న బలిమితోడుత కడుఁ బంగించనేలా (॥ఇచ్చ॥) జిగి శ్రీవేంకటేశుఁడు చేరి యెంత పెండ్లాడినా మిగులాఁ బంతకత్తెకు మీఱఁగనేలా నగుతా నిన్నుఁ గూడె నాయకుఁ డీతఁడే నేఁడు వెగటైన సిగ్గులకు వెరగందనేలా English(||pallavi||) ichchagamu sesugŏni iyyagŏnuḍagāga rachchalona sārĕ sārĕ ravvaseyanela (||ichcha||) dŏrayainasadi savadula nĕṁdarim̐ dĕchchinā yĕrabuleni illāli kela kobamu sirula kŏnagorilachchĕna lĕnni niṁchugŏnnā virasamu sesugŏni vĕṁgĕmāḍanela (||ichcha||) salabādimagam̐ḍu vichchanaviḍim̐ dirigide valasinadevulagu vādiṁchanela vŏlasi yĕṁdarise sevalu seyiṁchugŏnna balimidoḍuda kaḍum̐ baṁgiṁchanelā (||ichcha||) jigi śhrīveṁkaḍeśhum̐ḍu seri yĕṁta pĕṁḍlāḍinā migulām̐ baṁtagattĕgu mīṟam̐ganelā nagudā ninnum̐ gūḍĕ nāyagum̐ ḍīdam̐ḍe nem̐ḍu vĕgaḍaina siggulagu vĕragaṁdanelā