Title (Indic)ఇచ్చకమే సేయవద్దా యింతులకుఁ బతితోను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకమే సేయవద్దా యింతులకుఁ బతితోను కుచ్చి యీతని నేపొద్దూఁ గొనియాడఁ గదవే (॥ఇచ్చ॥) వాసులకే పెనఁగేవు వంతులకే జునిఁగేవు సేసవెట్టిన విభుఁడు చెనకఁగాను ఆసలెల్లా రేఁచేవు అట్టె చన్నులు దాఁచేవు బాసదప్ప కీతఁడు నీపై బత్తి చూపఁగాను (॥ఇచ్చ॥) కప్పురాన వేసేవు కాయమున రాసేవు చిప్పిల నాతఁడు వీచేయి వట్టఁగా చొప్పులెత్తి నవ్వేవు సొలసి కొప్పు దువ్వేవు తప్ప కీతఁడు రతికిఁ దమకించఁగాను (॥ఇచ్చ॥) చేతులెత్తి మొక్కేవు సిగ్గున మాఁట గుక్కేవు కాతరాన దానే నిన్నుఁ గాఁగిలించఁగా యీతల శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్ను నేలినాఁడు ఘాతల వేఁడుకోనేలే యీతఁడు మన్నించఁగాను English(||pallavi||) ichchagame seyavaddā yiṁtulagum̐ badidonu kuchchi yīdani nebŏddūm̐ gŏniyāḍam̐ gadave (||ichcha||) vāsulage pĕnam̐gevu vaṁtulage junim̐gevu sesavĕṭṭina vibhum̐ḍu sĕnagam̐gānu āsalĕllā rem̐sevu aṭṭĕ sannulu dām̐sevu bāsadappa kīdam̐ḍu nībai batti sūbam̐gānu (||ichcha||) kappurāna vesevu kāyamuna rāsevu sippila nādam̐ḍu vīseyi vaṭṭam̐gā sŏppulĕtti navvevu sŏlasi kŏppu duvvevu tappa kīdam̐ḍu radigim̐ damagiṁcham̐gānu (||ichcha||) sedulĕtti mŏkkevu sigguna mām̐ṭa gukkevu kādarāna dāne ninnum̐ gām̐giliṁcham̐gā yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu nelinām̐ḍu ghādala vem̐ḍugonele yīdam̐ḍu manniṁcham̐gānu