Title (Indic)ఇచ్చకమే సేసితేను యీడేరు వలపులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకమే సేసితేను యీడేరు వలపులు మచ్చికలే చూపవలె మగవానితోను (॥ఇచ్చ॥) శిరసు వంచకువే సిగ్గులు వడకువే తెరదీసి నిన్నతఁడు తేరి చూచీని మరఁగు వెట్టుకొకువే మరి తప్పించుకోకువే విరుల చెండున నిన్ను వేసితే నేమాయను (॥ఇచ్చ॥) మొక్కులు మొక్కకువే ముంచి చేయి పట్టకువే పక్కన నీ చన్నులు పట్టీ నితఁడు మిక్కిలి జంకించకువే మీరి యాన వెట్టకువే పిక్కటిల్లఁ గాఁగిటను బిగియించఁగాను (॥ఇచ్చ॥) పెనఁగు లాడకువే బెట్టి గోర నూఁదకువే ననుపున నీతోను నవ్వేవేళను యెనసె శ్రీవేంకటేశుఁ డిఁక నేమీననకువే చనవిచ్చి తనమోవి చవి చూపీ నితఁడు English(||pallavi||) ichchagame sesidenu yīḍeru valabulu machchigale sūbavalĕ magavānidonu (||ichcha||) śhirasu vaṁchaguve siggulu vaḍaguve tĕradīsi ninnadam̐ḍu teri sūsīni maram̐gu vĕṭṭugŏguve mari tappiṁchugoguve virula sĕṁḍuna ninnu veside nemāyanu (||ichcha||) mŏkkulu mŏkkaguve muṁchi seyi paṭṭaguve pakkana nī sannulu paṭṭī nidam̐ḍu mikkili jaṁkiṁchaguve mīri yāna vĕṭṭaguve pikkaḍillam̐ gām̐giḍanu bigiyiṁcham̐gānu (||ichcha||) pĕnam̐gu lāḍaguve bĕṭṭi gora nūm̐daguve nanubuna nīdonu navveveḽanu yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍim̐ka nemīnanaguve sanavichchi tanamovi savi sūbī nidam̐ḍu