Title (Indic)ఇచ్చకమే నడచేటి యిల్లాల నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకమే నడచేటి యిల్లాల నేను పచ్చిసేఁత లివి మాకు పాడిగా దయ్యా (॥ఇచ్చకమొ॥) పక్కనఁ దిట్టఁగ నోప పై పై వేఁడుకొన నోప వొక్కరీతి గుట్టుతోడ నుండే నేను అక్కడివారెనీకు నన్నిటికి నేరుతురు చిక్కించుక యిత వైతే నేయించుకో వయ్యా (॥ఇచ్చకమొ॥) అలిగి పొమ్మన నోప అప్పటి మొక్కఁగ నోప నిలిచి రాజసముతో డే నుండేను వెలయాండ్లే నీకు వినోదాలు నడుపేరు చెలఁగి నీ కిత వైతే సేయించుకో వయ్యా (॥ఇచ్చకమె॥) బొమ్మల జంకించ నోప పొరిఁ జెక్కు నొక్క నోప యెమ్మె నీరతులఁ జొక్కి యిట్టుండే నేనూ నెమ్మది శ్రీవెంకటేశ నీవు గూడితివిగ నన్ను చిమ్మల నీ సేవ నాచేఁ జేయించుకోవయ్యా English(||pallavi||) ichchagame naḍaseḍi yillāla nenu pachchisem̐ta livi māgu pāḍigā dayyā (||ichchagamŏ||) pakkanam̐ diṭṭam̐ga noba pai pai vem̐ḍugŏna noba vŏkkarīdi guṭṭudoḍa nuṁḍe nenu akkaḍivārĕnīgu nanniḍigi neruduru sikkiṁchuga yida vaide neyiṁchugo vayyā (||ichchagamŏ||) aligi pŏmmana noba appaḍi mŏkkam̐ga noba nilisi rājasamudo ḍe nuṁḍenu vĕlayāṁḍle nīgu vinodālu naḍuberu sĕlam̐gi nī kida vaide seyiṁchugo vayyā (||ichchagamĕ||) bŏmmala jaṁkiṁcha noba pŏrim̐ jĕkku nŏkka noba yĕmmĕ nīradulam̐ jŏkki yiṭṭuṁḍe nenū nĕmmadi śhrīvĕṁkaḍeśha nīvu gūḍidiviga nannu simmala nī seva nāsem̐ jeyiṁchugovayyā