Title (Indic)ఇచ్చకమే మదిఁ దోఁచీ నేమందునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకమే మదిఁ దోఁచీ నేమందునే వచ్చినది పదివేలు వాని నేమందునే (॥॥) కన్నులఁ జూచినప్పుడే కాఁకలెల్లాఁబెడఁబాసె యెన్నికల కేడలేదు యేమందునే మున్నిటి సుద్దు లెంచితే మోహములు చవిదప్పీ విన్నదే విందవుత మేలు విభుని నేమందునే (॥॥) సెలవి నవ్వినప్పుడే చిక్కులెల్లాఁ బెడఁబాసె యెలయించఁ దరిగాదు యేమందునే పలికితే సంతోషబావములు చవిదప్పీ పిలుపే కోటానఁగోటి ప్రియుని నేమందునే (॥॥) కాఁగిట నించినప్పుడే కడమలు వాసె నిట్టె యేఁగకున్నఁ జవిదప్పీ నేమందునే పాఁగిన శ్రీవేంకటాదిపతి యిన్నిటా నాతో రాఁగిన మోవితేనెలరసికు నేమందునే English(||pallavi||) ichchagame madim̐ dom̐sī nemaṁdune vachchinadi padivelu vāni nemaṁdune (||||) kannulam̐ jūsinappuḍe kām̐kalĕllām̐bĕḍam̐bāsĕ yĕnnigala keḍaledu yemaṁdune munniḍi suddu lĕṁchide mohamulu savidappī vinnade viṁdavuda melu vibhuni nemaṁdune (||||) sĕlavi navvinappuḍe sikkulĕllām̐ bĕḍam̐bāsĕ yĕlayiṁcham̐ darigādu yemaṁdune paligide saṁtoṣhabāvamulu savidappī pilube koḍānam̐goḍi priyuni nemaṁdune (||||) kām̐giḍa niṁchinappuḍe kaḍamalu vāsĕ niṭṭĕ yem̐gagunnam̐ javidappī nemaṁdune pām̐gina śhrīveṁkaḍādibadi yinniḍā nādo rām̐gina movidenĕlarasigu nemaṁdune