Title (Indic)ఇచ్చకపు మాటాలా యేతులాఁడా కడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకపు మాటాలా యేతులాఁడా కడు పచ్చిదేరే మేనెల్లఁ బట్టకు నన్నింకనూ (॥ఇచ్చ॥) దండగాఁగ మెడఁగుచ్చి తగిలించుకొంటివి అండనుండే వారు చాల కాపె నొకతె వెండియు నంతటఁ బోక వేగునంతకు నాడనే పండి వచ్చితివి చాలు పట్టకు నన్నింకను (॥ఇచ్చ॥) పొద్దు వొద్దునకు తలఁబూజించుకొంటివి వద్దనక యాకెమీఁది వాఁడుఁబువ్వులూ ముద్దు సేసి యాకె తావి ముక్కు వాయ నియ్యనీ పద్దుల మాటలె చాలు పట్టకు నన్నింకను (॥ఇచ్చ॥) చిందనీక యాకె మేని చిఱుఁజెమ టెల్లను పొందుగ నామీఁదం దెచ్చి వూసినాఁడవూ కందుఁగాక మేని వేంకటగిరి విభుఁడ నీ పందెపుఁ గూటమే చాలు పట్టకు నన్నింకను English(||pallavi||) ichchagabu māḍālā yedulām̐ḍā kaḍu pachchidere menĕllam̐ baṭṭagu nanniṁkanū (||ichcha||) daṁḍagām̐ga mĕḍam̐guchchi tagiliṁchugŏṁṭivi aṁḍanuṁḍe vāru sāla kābĕ nŏgadĕ vĕṁḍiyu naṁtaḍam̐ boga vegunaṁtagu nāḍane paṁḍi vachchidivi sālu paṭṭagu nanniṁkanu (||ichcha||) pŏddu vŏddunagu talam̐būjiṁchugŏṁṭivi vaddanaga yāgĕmīm̐di vām̐ḍum̐buvvulū muddu sesi yāgĕ tāvi mukku vāya niyyanī paddula māḍalĕ sālu paṭṭagu nanniṁkanu (||ichcha||) siṁdanīga yāgĕ meni siṟum̐jĕma ṭĕllanu pŏṁduga nāmīm̐daṁ dĕchchi vūsinām̐ḍavū kaṁdum̐gāga meni veṁkaḍagiri vibhum̐ḍa nī paṁdĕbum̐ gūḍame sālu paṭṭagu nanniṁkanu