Title (Indic)ఇచ్చక మాడ నెఱఁగ నేమి సేతునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చక మాడ నెఱఁగ నేమి సేతునే హెచ్చీఁ బెంజెమటలు యేమి సేతునే (॥ఇచ్చ॥) చక్కని పతిగుణాలు సారె నాతోఁ జెప్పఁగాను యెక్కడో వినీ వీను లేమి సేతునే పెక్కువ నాతఁడు నన్నుఁ బిలువ నంపె ననఁగా యిక్కడ నా మోము నవ్వీ నిఁక నేమి సేతునే (॥ఇచ్చ॥) యిదె మేడపై నతఁడు యిటు నన్నుఁ జూచెనంటే హృదయము చిల్లులయ్యీ నేమిసేతునే వదల కాతఁడు నా వాకిటికి వచ్చె నంటే యెదుటఁ గన్నీ ళ్లూరీ నిఁక నేమి సేతునే (॥ఇచ్చ॥) బలిమి నాతఁడు నాపైఁ జేయి వేయఁగాను యెలమి నిట్టూర్పు రేఁగె నేమి సేతునే కలసి శ్రీ వెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడఁగ యెలఁదీగెమనేను వొంగె నేమి సేతునే English(||pallavi||) ichchaga māḍa nĕṟam̐ga nemi sedune hĕchchīm̐ bĕṁjĕmaḍalu yemi sedune (||ichcha||) sakkani padiguṇālu sārĕ nādom̐ jĕppam̐gānu yĕkkaḍo vinī vīnu lemi sedune pĕkkuva nādam̐ḍu nannum̐ biluva naṁpĕ nanam̐gā yikkaḍa nā momu navvī nim̐ka nemi sedune (||ichcha||) yidĕ meḍabai nadam̐ḍu yiḍu nannum̐ jūsĕnaṁṭe hṛdayamu sillulayyī nemisedune vadala kādam̐ḍu nā vāgiḍigi vachchĕ naṁṭe yĕduḍam̐ gannī ḽlūrī nim̐ka nemi sedune (||ichcha||) balimi nādam̐ḍu nābaim̐ jeyi veyam̐gānu yĕlami niṭṭūrbu rem̐gĕ nemi sedune kalasi śhrī vĕṁkaḍādrighanum̐ḍu nannum̐ gūḍam̐ga yĕlam̐dīgĕmanenu vŏṁgĕ nemi sedune