Title (Indic)ఇపు డిన్నిటికి సైరించవలెఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇపు డిన్నిటికి సైరించవలెఁగా కపటా లిన్నియు మీఁదఁ గనుకొనేఁగాని (॥ఇపు॥) యేడ లేని మచ్చికల కింత చిక్కినవేళ నాడ(డి?) నెట్టెల్లానే నాడవలెఁగా వేడుకైతేఁ జాలుఁగాక విసుగనేఁటికి నే సూడునట్టియ యప్పుడైనాఁ జూచుకొనేఁగాని (॥ఇపు॥) పంతపునాకోరికెలబారికిఁ జిక్కినవేళ వింతలు నీవేమనిన వినవలెఁగా మంతనాన నాతోడ మాటలకుఁ బనిలేదు అంతయు నీరతివేళ నాడుకొనేఁగాని (॥ఇపు॥) చిత్తము నీకొప్పగించి చేతికిలోనైన వేళ కొత్త నీచెఁ(చేఁ?) తల కియ్యకొనవలెఁగా పొత్తులశ్రీవేంకటేశ పొందితివి చాలు నీ తత్తరపులచ్చనల దాఁచుకొనేఁగాని English(||pallavi||) ibu ḍinniḍigi sairiṁchavalĕm̐gā kabaḍā linniyu mīm̐dam̐ ganugŏnem̐gāni (||ibu||) yeḍa leni machchigala kiṁta sikkinaveḽa nāḍa(ḍi?) nĕṭṭĕllāne nāḍavalĕm̐gā veḍugaidem̐ jālum̐gāga visuganem̐ṭigi ne sūḍunaṭṭiya yappuḍainām̐ jūsugŏnem̐gāni (||ibu||) paṁtabunāgorigĕlabārigim̐ jikkinaveḽa viṁtalu nīvemanina vinavalĕm̐gā maṁtanāna nādoḍa māḍalagum̐ baniledu aṁtayu nīradiveḽa nāḍugŏnem̐gāni (||ibu||) sittamu nīgŏppagiṁchi sedigilonaina veḽa kŏtta nīsĕm̐(sem̐?) tala kiyyagŏnavalĕm̐gā pŏttulaśhrīveṁkaḍeśha pŏṁdidivi sālu nī tattarabulachchanala dām̐sugŏnem̐gāni