Title (Indic)హత్తి రాజసపువాఁడవయినాఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) హత్తి రాజసపువాఁడవయినాఁ గాని చిత్తము వచ్చినయట్టు సేతువు గాని (॥హత్తి॥) చనవు గలిగేనంటా సారె సారె మాటలాడె విని విని నీవేమి వేరకుమీ మనసునఁ గలదెల్లా మరిదాఁచనే నీకు మునుకొన్న సతులకు ముచ్చట స్వభావము (॥హత్తి॥) నిండిన మందెమేళాన నీతో సరసమాడేను అండనే అందుకు లోనై అలయకుమీ వుండిన దున్నట్టేకాని వూరకే కల్పించనోప నిండు గరితెలాడితే నిజమునిష్టూరము (॥హత్తి॥) కాతరాన నిన్ను నిట్టే కాఁగిలించుక కూడితి నాతమకములుచూచి నవ్వేవు సుమ్మీ ఘాతల శ్రీవెంకటేశ కైకొంటివి నిన్ను దూర రాతిరిఁబగలునుండి రతులఁ జొక్కితివి English(||pallavi||) hatti rājasabuvām̐ḍavayinām̐ gāni sittamu vachchinayaṭṭu seduvu gāni (||hatti||) sanavu galigenaṁṭā sārĕ sārĕ māḍalāḍĕ vini vini nīvemi veragumī manasunam̐ galadĕllā maridām̐sane nīgu munugŏnna sadulagu muchchaḍa svabhāvamu (||hatti||) niṁḍina maṁdĕmeḽāna nīdo sarasamāḍenu aṁḍane aṁdugu lonai alayagumī vuṁḍina dunnaṭṭegāni vūrage kalbiṁchanoba niṁḍu garidĕlāḍide nijamuniṣhṭūramu (||hatti||) kādarāna ninnu niṭṭe kām̐giliṁchuga kūḍidi nādamagamulusūsi navvevu summī ghādala śhrīvĕṁkaḍeśha kaigŏṁṭivi ninnu dūra rādirim̐bagalunuṁḍi radulam̐ jŏkkidivi