Title (Indic)హరియే యెరుఁగును అందరి బ్రతుకులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) హరియే యెరుఁగును అందరి బ్రతుకులు యిరవై యీతని యెరుఁగుటే మేలు (॥హరి॥) వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు యెనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజకీటముల మరెవ్వఁ డెరుఁగు (॥హరి॥) ఆసఁ దొల్లి మును లనంతకోట్లు చేసిరి తపములు సేనలుగా యే సిరులందిరి యెరఁగ రెవ్వరును వేసపు నరులకు విధి యేదో (॥హరి॥) కల వనేకములు కర్మమార్గములు పలుదేవత లిటు పాటించిరి బలిమి శ్రీవేంకటపతికి మొర ఇడి వెలసిరి తుదనిదే వెరవిందరికి English(||pallavi||) hariye yĕrum̐gunu aṁdari bradugulu yiravai yīdani yĕrum̐guḍe melu (||hari||) vĕnagaḍi brahmalu vevela saṁkhyalu yĕnasi brahmāṁḍamu leliraḍa pĕnagŏni vārala perulu marasiri manujagīḍamula marĕvvam̐ ḍĕrum̐gu (||hari||) āsam̐ dŏlli munu lanaṁtagoṭlu sesiri tabamulu senalugā ye sirulaṁdiri yĕram̐ga rĕvvarunu vesabu narulagu vidhi yedo (||hari||) kala vanegamulu karmamārgamulu paludevada liḍu pāḍiṁchiri balimi śhrīveṁkaḍabadigi mŏra iḍi vĕlasiri tudanide vĕraviṁdarigi