Title (Indic)హరిహరి యిందరికి నబ్బురముగాని యిది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) హరిహరి యిందరికి నబ్బురముగాని యిది పరగ నీ దాసుఁడే పరతత్వవేది (॥హరి॥) పొలసి మశకమండుఁ బొడమేటి జీవుని తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపోయీనీ నిలువెంత నీఁటెంత నీమాయ లివి భువి బలిమిఁ దెలియువాఁడె పరతత్వవేది (॥హరి॥) తగిలి చూచిన నాత్మఁ దనుఁ గానరాదుగాని జగమెల్ల దానైతే సరి గనీని చిగురెంత చేగెంత శ్రీపతి యిందులో నీ - పగటు దెలియువాఁడే పరతత్వవేది (॥హరి॥) యేవంకఁ దనబుద్ధి యెక్కడనుండునోకాని శ్రీ వేంకటేశ నిన్నుఁ జింతించీని పూవెంత ఫలమెంత పురుషోత్తముఁడ నీ - భావమెరుఁగువాఁడె పరతత్వవేది English(||pallavi||) harihari yiṁdarigi nabburamugāni yidi paraga nī dāsum̐ḍe paradatvavedi (||hari||) pŏlasi maśhagamaṁḍum̐ bŏḍameḍi jīvuni talam̐pu brahmāṁḍālu dām̐ṭiboyīnī niluvĕṁta nīm̐ṭĕṁta nīmāya livi bhuvi balimim̐ dĕliyuvām̐ḍĕ paradatvavedi (||hari||) tagili sūsina nātmam̐ danum̐ gānarādugāni jagamĕlla dānaide sari ganīni sigurĕṁta segĕṁta śhrībadi yiṁdulo nī - pagaḍu dĕliyuvām̐ḍe paradatvavedi (||hari||) yevaṁkam̐ danabuddhi yĕkkaḍanuṁḍunogāni śhrī veṁkaḍeśha ninnum̐ jiṁtiṁchīni pūvĕṁta phalamĕṁta puruṣhottamum̐ḍa nī - bhāvamĕrum̐guvām̐ḍĕ paradatvavedi