Title (Indic)గుట్టుతోనే వుందుగాని కోరి నేనేమి సేసినా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గుట్టుతోనే వుందుగాని కోరి నేనేమి సేసినా పట్టపు రమణి నాతోఁ బదరేవు సుమ్మీ (॥గుట్టు॥) కోవిలలు చిగురాకు కొరుకునంటా భూమి- నావలీవలివా రెల్లా నాడుకొందరు కొవిల కూఁతలు నీకుత్తికలోనివి గదే కావి నీ మోవిచిగురు గంటిచేసీఁ జుమ్మీ (॥గుట్టు॥) జక్కవలు భూమిలోన చంద్రోదయమైతే తక్కక విరహాన బెదురు నందురు జక్కవనీచన్ను లిట్టే సరి నీపయ్యద నవె పెక్కుచంద్రవంకలైతే బెదరీఁ జుమ్మీ (॥గుట్టు॥) తుమ్మిదలు తామెరపైఁ దోలినానుఁ బోవందురు దొమ్ముల శ్రీవేంకటాద్రి తుమ్మిద నేను కొమ్మ నీతుమ్మిదవంటికురులు నీనెమ్మోముఁ దుమ్మిమీఁదఁ జెదరి యంతటఁ గూఁడెఁజుమ్మీ English(||pallavi||) guṭṭudone vuṁdugāni kori nenemi sesinā paṭṭabu ramaṇi nādom̐ badarevu summī (||guṭṭu||) kovilalu sigurāgu kŏrugunaṁṭā bhūmi- nāvalīvalivā rĕllā nāḍugŏṁdaru kŏvila kūm̐talu nīguttigalonivi gade kāvi nī movisiguru gaṁṭisesīm̐ jummī (||guṭṭu||) jakkavalu bhūmilona saṁdrodayamaide takkaga virahāna bĕduru naṁduru jakkavanīsannu liṭṭe sari nībayyada navĕ pĕkkusaṁdravaṁkalaide bĕdarīm̐ jummī (||guṭṭu||) tummidalu tāmĕrabaim̐ dolinānum̐ bovaṁduru dŏmmula śhrīveṁkaḍādri tummida nenu kŏmma nīdummidavaṁṭigurulu nīnĕmmomum̐ dummimīm̐dam̐ jĕdari yaṁtaḍam̐ gūm̐ḍĕm̐jummī