Title (Indic)గుట్టుతోడిదాన నేను కొసరనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గుట్టుతోడిదాన నేను కొసరనేల దిట్టతనమె నాది తెలుకొనవయ్యా (॥గుట్టు॥) పెక్కుమాట లాడఁగాను ప్రియుఁడ నీతో నేను వొక్కటి హితవౌను వేరొక్కటిగాదు చక్కటులు నీవాఁడితే సారెకు వినేఁగాని అక్కరతో మారుమాట లడుగకువయ్యా (॥గుట్టు॥) సారె నీతో నవ్వఁగాను చప్పనవునో వుప్పనవునో తేరకొనని మనసు తిద్దుకోరాదు కేరి నీవు నవ్వితేను కిమ్ములఁ జూచేఁగాని ఆరయ నన్నుఁ గలుపే వంతయేఁటికయ్యా (॥గుట్టు॥) నిన్ను బాసగొనఁగాను నిలుపుదువోమరి సన్నలఁ దోతువో అంతసాధించనేల యెన్నఁగ నన్నుఁ గూడితి విదిగో శ్రీవెంకటేశ వెన్నవంటి నయముతో వేఁడుకోనేలయ్యా English(||pallavi||) guṭṭudoḍidāna nenu kŏsaranela diṭṭadanamĕ nādi tĕlugŏnavayyā (||guṭṭu||) pĕkkumāḍa lāḍam̐gānu priyum̐ḍa nīdo nenu vŏkkaḍi hidavaunu verŏkkaḍigādu sakkaḍulu nīvām̐ḍide sārĕgu vinem̐gāni akkarado mārumāḍa laḍugaguvayyā (||guṭṭu||) sārĕ nīdo navvam̐gānu sappanavuno vuppanavuno teragŏnani manasu tiddugorādu keri nīvu navvidenu kimmulam̐ jūsem̐gāni āraya nannum̐ galube vaṁtayem̐ṭigayyā (||guṭṭu||) ninnu bāsagŏnam̐gānu nilubuduvomari sannalam̐ doduvo aṁtasādhiṁchanela yĕnnam̐ga nannum̐ gūḍidi vidigo śhrīvĕṁkaḍeśha vĕnnavaṁṭi nayamudo vem̐ḍugonelayyā