Title (Indic)గుట్టుతోడి బ్రదు కొక కొలఁదైనఁ జాలురా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గుట్టుతోడి బ్రదు కొక కొలఁదైనఁ జాలురా గట్టిగా నీవు మన్నించే కరుణే చాలురా (॥గుట్టు॥) మొదల నలుగలేను ముంచి నీకు మొక్కలేను కదిసియున్న పెద్దరికమే చాలురా పెదవులఁ దిట్టలేను పెంచి పంతమియ్యలేను అదన నీవు నవ్విన ఆపాటే చాలురా (॥గుట్టు॥) బిగిసియుండగలేను ప్రియము చెప్పఁగలేను మొగము చూడఁగలిగేముచ్చటే చాలురా తగవులు చెప్పలేను తగ నిచ్చలాడలేను తగువైన వావులతో తత్తరాలే చాలురా (॥గుట్టు॥) అటు పరాకు గాలేను ఆనవెట్టుకోలేను యిటుఁ నిన్నుఁ గూడితి నాకిది చాలురా ఘటన శ్రీవేంకటేశ కరఁగించి మానలేను తటుకున నీవు నాకు దక్కినదే చాలురా English(||pallavi||) guṭṭudoḍi bradu kŏga kŏlam̐dainam̐ jālurā gaṭṭigā nīvu manniṁche karuṇe sālurā (||guṭṭu||) mŏdala nalugalenu muṁchi nīgu mŏkkalenu kadisiyunna pĕddarigame sālurā pĕdavulam̐ diṭṭalenu pĕṁchi paṁtamiyyalenu adana nīvu navvina ābāḍe sālurā (||guṭṭu||) bigisiyuṁḍagalenu priyamu sĕppam̐galenu mŏgamu sūḍam̐galigemuchchaḍe sālurā tagavulu sĕppalenu taga nichchalāḍalenu taguvaina vāvulado tattarāle sālurā (||guṭṭu||) aḍu parāgu gālenu ānavĕṭṭugolenu yiḍum̐ ninnum̐ gūḍidi nāgidi sālurā ghaḍana śhrīveṁkaḍeśha karam̐giṁchi mānalenu taḍuguna nīvu nāgu dakkinade sālurā