Title (Indic)ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁ గదా వేదములు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁ గదా వేదములు జననములుఁ గులము లాచారములుఁ గలిగె (॥ఘను॥) కలుషభంజనుఁ డితఁడు గలుగఁగఁగదా జగతిఁ గలిగె నిందరి జన్మగతులనెలవు మలసి యుతఁడొకఁడు వొడమఁగఁగదా యిందరికి నిలువ నీడలు గలిగె నిధినాధానములై (॥ఘను॥) కమలాక్షుఁ డితఁడు గలుగఁగఁగదా దేవతలు గమిగూడి రిందరును గండిగడచి ప్రమదమున నితఁడు నిలుపఁగఁగదా సస్యములు అమర ఫలియించె లోకానందమగుచు (॥ఘను॥) గరిమె వేంకటవిభుఁడొకఁడు గలుగఁగఁగదా ధరయు నభమును రసాతలము గలిగె పరమాత్ముఁడితఁడు లోపల గలుగఁగాఁగదా అరిది చవులును హితవు లన్నియునుఁ గలిగె English(||pallavi||) ghanum̐ ḍīm̐tam̐ḍŏgam̐ḍu galugam̐gam̐ gadā vedamulu jananamulum̐ gulamu lāsāramulum̐ galigĕ (||ghanu||) kaluṣhabhaṁjanum̐ ḍidam̐ḍu galugam̐gam̐gadā jagadim̐ galigĕ niṁdari janmagadulanĕlavu malasi yudam̐ḍŏgam̐ḍu vŏḍamam̐gam̐gadā yiṁdarigi niluva nīḍalu galigĕ nidhinādhānamulai (||ghanu||) kamalākṣhum̐ ḍidam̐ḍu galugam̐gam̐gadā devadalu gamigūḍi riṁdarunu gaṁḍigaḍasi pramadamuna nidam̐ḍu nilubam̐gam̐gadā sasyamulu amara phaliyiṁchĕ logānaṁdamagusu (||ghanu||) garimĕ veṁkaḍavibhum̐ḍŏgam̐ḍu galugam̐gam̐gadā dharayu nabhamunu rasādalamu galigĕ paramātmum̐ḍidam̐ḍu lobala galugam̐gām̐gadā aridi savulunu hidavu lanniyunum̐ galigĕ