Title (Indic)ఘన సంసారులకెల్ల కర్మమై పొడచూపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఘన సంసారులకెల్ల కర్మమై పొడచూపు ననిచి యింతకు గురి నరహరి వొక్కఁడు (॥ఘన॥) యెలమిఁ బుణ్యము లెల్ల యింద్రలోకమై తోఁచు నలుఁడ పాపములే నరకలోకమై తోఁచు పొలసి రెండు సరియైతే భూలోకమై తోఁచు కలవాఁ డొక్కఁడే గుఱి కమలావిభుఁడు (॥ఘన॥) పరగ రాజసులకు బ్రహ్మయై పొడచూపు గరిమ తామసులకు కఱకంఠుడై యుండు సిరుల సాత్వికులకు శ్రీకాంతుఁడై మించు నిరవైనవాఁడు శ్రీహరి యొక్కఁడే (॥ఘన॥) ఆయమెఱిఁగినవారి కంతరాత్మయై యుండు చాయ గన్నవారికి జగమెల్ల నై తోఁచు చేయ గన్నవారికి శ్రీ వేంకటేశుఁడై తోఁచు యేయెడ వారికి యీదేవుఁ డొక్కఁడే English(||pallavi||) ghana saṁsārulagĕlla karmamai pŏḍasūbu nanisi yiṁtagu guri narahari vŏkkam̐ḍu (||ghana||) yĕlamim̐ buṇyamu lĕlla yiṁdralogamai tom̐su nalum̐ḍa pābamule naragalogamai tom̐su pŏlasi rĕṁḍu sariyaide bhūlogamai tom̐su kalavām̐ ḍŏkkam̐ḍe guṟi kamalāvibhum̐ḍu (||ghana||) paraga rājasulagu brahmayai pŏḍasūbu garima tāmasulagu kaṟagaṁṭhuḍai yuṁḍu sirula sātvigulagu śhrīgāṁtum̐ḍai miṁchu niravainavām̐ḍu śhrīhari yŏkkam̐ḍe (||ghana||) āyamĕṟim̐ginavāri kaṁtarātmayai yuṁḍu sāya gannavārigi jagamĕlla nai tom̐su seya gannavārigi śhrī veṁkaḍeśhum̐ḍai tom̐su yeyĕḍa vārigi yīdevum̐ ḍŏkkam̐ḍe