Title (Indic)గందము వూసేవేలే కమ్మని మేన యీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గందము వూసేవేలే కమ్మని మేన యీ- గందము నీమేనితావికంటె నెక్కుడా (॥గంద॥) అద్దము చూచేవేలే అప్పటపట్టికిని అద్దము నీ మోముకంటె నపురూపమా ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ- గద్దరికన్నులకంటె కమలము ఘనమా (॥గంద॥) బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా (॥గంద॥) సవర మేఁటికినే జడియు నీ నెరులకు సవరము నీకొప్పుసరి వచ్చీనా యివలఁ జవుల నీకునేలే వెంకటపతి - సవరని కెమ్మో విచవికంటేనా English(||pallavi||) gaṁdamu vūsevele kammani mena yī- gaṁdamu nīmenidāvigaṁṭĕ nĕkkuḍā (||gaṁda||) addamu sūsevele appaḍabaṭṭigini addamu nī momugaṁṭĕ naburūbamā ŏddiga tāmaravirinŏttevu kannulu nī- gaddarigannulagaṁṭĕ kamalamu ghanamā (||gaṁda||) baṁgāru vĕṭṭevele paḍam̐ti nī mĕyiniṁḍā baṁgāru nīdanugāṁti pradivachchīnā uṁgarālem̐ṭigine vŏḍigibuveḽḽa vĕṁgalimaṇulu nī veligoram̐bolunā (||gaṁda||) savara mem̐ṭigine jaḍiyu nī nĕrulagu savaramu nīgŏppusari vachchīnā yivalam̐ javula nīgunele vĕṁkaḍabadi - savarani kĕmmo visavigaṁṭenā