Title (Indic)గందమందుకోవయ్య కలికి నీ కొసఁగీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గందమందుకోవయ్య కలికి నీ కొసఁగీని అందుకునందుకే సరి అధికము వలపు (॥గంద॥) దవ్వుల నుండిన పతి దగ్గరి వచ్చినప్పుడు రవ్వలైన కోపము రాకుండదు నవ్వులునుఁ దోడనే నయములు చూపకుండదు యెవ్వరికి నిందుకుగా నెగ్గులేల యెంచను (॥గంద॥) తలవంచు కొన్నవాఁడు తప్పకచూచితేను మొలకపంతాలు గడుమోవకుండవు అలరి అంతటిలోనే ఆసలు రేగకుండవు చలము లిందుకుగాను సాదించనేటికి (॥గంద॥) మెడఁగట్టుకొన్నవాడు మేలములాడితేను అడియాలములు మేన నంటకుండవు అడరి శ్రీవేంకటేశ ఆపె యలమేలుమంగ వొడికమై కూడితిరి వోరించనేటికి English(||pallavi||) gaṁdamaṁdugovayya kaligi nī kŏsam̐gīni aṁdugunaṁduge sari adhigamu valabu (||gaṁda||) davvula nuṁḍina padi daggari vachchinappuḍu ravvalaina kobamu rāguṁḍadu navvulunum̐ doḍane nayamulu sūbaguṁḍadu yĕvvarigi niṁdugugā nĕggulela yĕṁchanu (||gaṁda||) talavaṁchu kŏnnavām̐ḍu tappagasūsidenu mŏlagabaṁtālu gaḍumovaguṁḍavu alari aṁtaḍilone āsalu regaguṁḍavu salamu liṁdugugānu sādiṁchaneḍigi (||gaṁda||) mĕḍam̐gaṭṭugŏnnavāḍu melamulāḍidenu aḍiyālamulu mena naṁṭaguṁḍavu aḍari śhrīveṁkaḍeśha ābĕ yalamelumaṁga vŏḍigamai kūḍidiri voriṁchaneḍigi