Title (Indic)గజరున నంతా నేల కలయఁబెట్టుకొనేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గజరున నంతా నేల కలయఁబెట్టుకొనేవు గుజగుజతో నవ్వుకొంటా నుండరాదా (॥గజ॥) ఇంతితోనే మాటాడితే నేల పూనుకవచ్చేవు సంతసతులెల్లా నీకు సమమేకాదా పంతపు సవతులము పడితళించుకొంటేను కొంతగొంత నీవు నవ్వుకొంటా నుండరాదా (॥గజ॥) నెలఁతఁ దప్పువట్టితే నీవేల దిద్దవచ్చేవు సళువుగొల్లెత లింతా సరియేకాదా వలపుదొడ్డివారము వంతువాసు లెంచుకొంటే కులికి నీవు నవ్వుకొంటా నుండరాదా (॥గజ॥) అంగన నే సాదించితే ఆకెనేల మొక్కించేవు జంగిలివారెల్లా నీకు సరియే కదా యెంగిలి శ్రీవేంకటేశ యే నలమేల్మంగను కుంగక కూడితి నవ్వుకొంటా నుండరాదా English(||pallavi||) gajaruna naṁtā nela kalayam̐bĕṭṭugŏnevu gujagujado navvugŏṁṭā nuṁḍarādā (||gaja||) iṁtidone māḍāḍide nela pūnugavachchevu saṁtasadulĕllā nīgu samamegādā paṁtabu savadulamu paḍidaḽiṁchugŏṁṭenu kŏṁtagŏṁta nīvu navvugŏṁṭā nuṁḍarādā (||gaja||) nĕlam̐tam̐ dappuvaṭṭide nīvela diddavachchevu saḽuvugŏllĕda liṁtā sariyegādā valabudŏḍḍivāramu vaṁtuvāsu lĕṁchugŏṁṭe kuligi nīvu navvugŏṁṭā nuṁḍarādā (||gaja||) aṁgana ne sādiṁchide āgĕnela mŏkkiṁchevu jaṁgilivārĕllā nīgu sariye kadā yĕṁgili śhrīveṁkaḍeśha ye nalamelmaṁganu kuṁgaga kūḍidi navvugŏṁṭā nuṁḍarādā