Title (Indic)గడుసుఁదన మేఁటికి కలికి మోనమటే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గడుసుఁదన మేఁటికి కలికి మోనమటే తడవకున్న దిట్టతన మిది యనఁడా (॥గడు॥) పంతమాడరాదుగాక పతితోడ సతికిని అంతరంగమైనఁ గొంత ఆనతీరాదా మంతుకెక్కి వద్దనుండి మారుత్తరాలియ్య విదే కాంతుఁడు నీకిదియెల్లా గర్వముగాఁ జూడఁడా (॥గడు॥) తిట్టరాదుగా కతనిఁ దేరిచూచి నీకింతేసి తెట్టెలుగా మొక్కఁగాను దీవించరాదా చెట్టవట్టి పెనఁగఁగాఁ జెప్పఁగదే వినయాలు గుట్టుతోడ నుండితేను కుచ్చిత మిదనఁడా (॥గడు॥) బాధించరాదుగాక బడి శ్రీవెంకటేశ్వరుఁ బాదుగాను మెచ్చి మెచ్చి పాడరాదా యీదెస నలమేల్మంగ వెనసితి వితని పోదితో నిటుగాకున్న పొరపొచ్చ మెంచఁడా English(||pallavi||) gaḍusum̐dana mem̐ṭigi kaligi monamaḍe taḍavagunna diṭṭadana midi yanam̐ḍā (||gaḍu||) paṁtamāḍarādugāga padidoḍa sadigini aṁtaraṁgamainam̐ gŏṁta ānadīrādā maṁtugĕkki vaddanuṁḍi māruttarāliyya vide kāṁtum̐ḍu nīgidiyĕllā garvamugām̐ jūḍam̐ḍā (||gaḍu||) tiṭṭarādugā kadanim̐ derisūsi nīgiṁtesi tĕṭṭĕlugā mŏkkam̐gānu dīviṁcharādā sĕṭṭavaṭṭi pĕnam̐gam̐gām̐ jĕppam̐gade vinayālu guṭṭudoḍa nuṁḍidenu kuchchida midanam̐ḍā (||gaḍu||) bādhiṁcharādugāga baḍi śhrīvĕṁkaḍeśhvarum̐ bādugānu mĕchchi mĕchchi pāḍarādā yīdĕsa nalamelmaṁga vĕnasidi vidani podido niḍugāgunna pŏrabŏchcha mĕṁcham̐ḍā