Title (Indic)గడుసవు గదె నీవు కలికీ । వోరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గడుసవు గదె నీవు కలికీ । వోరి అడరి మరుని మహి మటువంటిదౌరా (॥గడు॥) తప్పకచూచేవేమే తరుణీ వోరి కుప్పించీ నీమీఁదను చకోరాలురా చిప్పిల నామేనెల్లాఁ జెమరించెనే వోరి యెప్పుడూ వాఁటిగుణాలు ఇటువంటివౌరా (॥గడు॥) వొఱపులే నీచన్ను లువిదా వోరి యెఱసీ జక్కవలు నీమీఁదనుండిరా మఱి కరఁగేఁగదవే మగువా వోరి యెఱఁగనా వాఁటివోజ లిటువంటివౌరా (॥గడు॥) మించి వురమెక్కే వలమేలుమంగా వోరి యంచలు నీయందు వోలలాడఁజొచ్చెరా యెంచఁగల శ్రీవేంకటేశుఁడఁగదే వోరి వంచనతోఁ గూడితివి నానిజాడలౌరా English(||pallavi||) gaḍusavu gadĕ nīvu kaligī | vori aḍari maruni mahi maḍuvaṁṭidaurā (||gaḍu||) tappagasūseveme taruṇī vori kuppiṁchī nīmīm̐danu sagorālurā sippila nāmenĕllām̐ jĕmariṁchĕne vori yĕppuḍū vām̐ṭiguṇālu iḍuvaṁṭivaurā (||gaḍu||) vŏṟabule nīsannu luvidā vori yĕṟasī jakkavalu nīmīm̐danuṁḍirā maṟi karam̐gem̐gadave maguvā vori yĕṟam̐ganā vām̐ṭivoja liḍuvaṁṭivaurā (||gaḍu||) miṁchi vuramĕkke valamelumaṁgā vori yaṁchalu nīyaṁdu volalāḍam̐jŏchchĕrā yĕṁcham̐gala śhrīveṁkaḍeśhum̐ḍam̐gade vori vaṁchanadom̐ gūḍidivi nānijāḍalaurā