Title (Indic)గతులన్ని ఖిలమైన కలియుగమందును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి యీతఁడే చూపె ఘనగురుదైవము (॥గతు॥) యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి- మీతనివల్లనే కంటి మీతిరుమణి యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర- మీతఁడే రామానుజులు యిహపరదైవము (॥గతు॥) వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు చలిమి నీతఁడే చూపె శరణాగతి నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము మలసి రామానుజులే మాటలాడే దైవము (॥గతు॥) నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము English(||pallavi||) gadulanni khilamaina kaliyugamaṁdunu gadi yīdam̐ḍe sūbĕ ghanagurudaivamu (||gadu||) yīdanigaruṇanegā yila vaiṣhṇavulamaidi- mīdanivallane kaṁṭi mīdirumaṇi yīdam̐ḍegā vubadeśha michchĕ naṣhṭākṣharimaṁtra- mīdam̐ḍe rāmānujulu yihabaradaivamu (||gadu||) vĕlayiṁchĕ nīdam̐ḍegā vedabu rahasyamulu salimi nīdam̐ḍe sūbĕ śharaṇāgadi nilibinām̐ ḍīdam̐ḍegā nijamudradhāraṇamu malasi rāmānujule māḍalāḍe daivamu (||gadu||) niyamamu līdam̐ḍegā nilibĕm̐ brabannulagu dayado mokṣhamu sūbĕm̐ daga nīdam̐ḍe nayamai śhrīveṁkaḍeśhu naga mĕkkevāgiḍanu dayam̐jūsī mammu niṭṭe tallidaṁḍri daivamu