Title (Indic)గద్దించి నేఁడు కొత్తలు గడించెఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గద్దించి నేఁడు కొత్తలు గడించెఁ గాక వొద్దికై మందెమేళాన నుండమా తొల్లి (॥గద్దించి॥) వొంటి నేఁజెనకితే వొరపులు వట్టీని నంటునఁ దాను నేను నవ్వమా తొల్లి వెంటవెంట నెరసులు వెదకీనప్పటివచ్చి అంటి ముట్టి సరసములాడమా తొల్లి (॥గద్దించి॥) కందువ నాచన్నులు దాఁకఁగా దప్పక చూచీని అంది కమలాల వేట్లాడమా తొల్లి ముందు నాయెంగిలిమోవి మోవ మాటాడితిననీ విందుపొత్తులు గలసి వెలయమా తొల్లి (॥గద్దించి॥) బీరమునఁ దనతోడఁ బెనఁగితినని యాడీ కూరిమితోఁ గాఁగలించుకొనమా తొల్లి యీరీతి శ్రీ వేంకటేశుఁడిన్నిటా నన్నేలినాఁడు చేరి చుట్టురికాలెల్లాఁ జేయమా తొల్లి English(||pallavi||) gaddiṁchi nem̐ḍu kŏttalu gaḍiṁchĕm̐ gāga vŏddigai maṁdĕmeḽāna nuṁḍamā tŏlli (||gaddiṁchi||) vŏṁṭi nem̐jĕnagide vŏrabulu vaṭṭīni naṁṭunam̐ dānu nenu navvamā tŏlli vĕṁṭavĕṁṭa nĕrasulu vĕdagīnappaḍivachchi aṁṭi muṭṭi sarasamulāḍamā tŏlli (||gaddiṁchi||) kaṁduva nāsannulu dām̐kam̐gā dappaga sūsīni aṁdi kamalāla veṭlāḍamā tŏlli muṁdu nāyĕṁgilimovi mova māḍāḍidinanī viṁdubŏttulu galasi vĕlayamā tŏlli (||gaddiṁchi||) bīramunam̐ danadoḍam̐ bĕnam̐gidinani yāḍī kūrimidom̐ gām̐galiṁchugŏnamā tŏlli yīrīdi śhrī veṁkaḍeśhum̐ḍinniḍā nannelinām̐ḍu seri suṭṭurigālĕllām̐ jeyamā tŏlli