Title (Indic)గద్దెమీఁద నున్నవాఁడు కరుణానిధైనవాఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గద్దెమీఁద నున్నవాఁడు కరుణానిధైనవాఁడు గద్దరివాఁడుగదె యీ ఘనుఁడు వో చెలియా (॥గద్దె॥) వెన్నెలమొగముతోడ వేడక నవ్వులతోడ చెన్నుమీరీ నిదె నరసింహదేవుఁడు వున్నది తొడమీఁదట నొద్దికతో లకిమమ్మ ఇన్నిటా జాణఁడుగదె యీతఁడు వోచెలియా (॥గద్దె॥) అంగపుఁ గాంతులతోడ నల్లాడే జడలతొడ చెంగలించీఁ గదె నరసింహదేవుఁడు ముంగిటఁ బ్రహ్లాదుఁడు మొక్కుతాఁ బాటలువాడి సంగతైనవాఁడుగదె చనవిచ్చీఁ జెలియా (॥గద్దె॥) బీరపు మాటలతోడ పెలుఁగిరీటముతోడ చేరి నిన్నుఁ గూడె నదసింహదేవుఁడు యీరీతి శ్రీవేంకటేశుఁ డితడై వరములిచ్చీ ధారుణి కాంతుఁడు గదె తానితఁడు చెలియా English(||pallavi||) gaddĕmīm̐da nunnavām̐ḍu karuṇānidhainavām̐ḍu gaddarivām̐ḍugadĕ yī ghanum̐ḍu vo sĕliyā (||gaddĕ||) vĕnnĕlamŏgamudoḍa veḍaga navvuladoḍa sĕnnumīrī nidĕ narasiṁhadevum̐ḍu vunnadi tŏḍamīm̐daḍa nŏddigado lagimamma inniḍā jāṇam̐ḍugadĕ yīdam̐ḍu vosĕliyā (||gaddĕ||) aṁgabum̐ gāṁtuladoḍa nallāḍe jaḍaladŏḍa sĕṁgaliṁchīm̐ gadĕ narasiṁhadevum̐ḍu muṁgiḍam̐ brahlādum̐ḍu mŏkkudām̐ bāḍaluvāḍi saṁgadainavām̐ḍugadĕ sanavichchīm̐ jĕliyā (||gaddĕ||) bīrabu māḍaladoḍa pĕlum̐girīḍamudoḍa seri ninnum̐ gūḍĕ nadasiṁhadevum̐ḍu yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍidaḍai varamulichchī dhāruṇi kāṁtum̐ḍu gadĕ tānidam̐ḍu sĕliyā